Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి'(Varanasi) అనే భారీ పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యనే ‘వారణాసి’ టైటిల్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దాదాపు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఈవెంట్ ను నిర్వహించినట్టు కూడా టాక్ నడిచింది. అలాగే ఆ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దాదాపు రూ.60 కోట్లకు దక్కించుకున్నట్టు మరో టాక్.

Varanasi

సో అలా చూసుకుంటే.. ఈవెంట్ రూపంలోనే రూ.40 కోట్ల లాభం వెనకేసుకున్నట్టే అని చెప్పాలి. రాజమౌళి ఏం చేసినా ఇలా కాలిక్యులేటివ్ గానే ఉంటుంది. అతను తన సినిమాకి నిర్మాతతో భారీ బడ్జెట్ పెట్టించినా.. దానికి తగ్గట్టు బిజినెస్ జరిగేలా చూసుకోవడం రాజమౌళికి అలవాటు. అవసరమైతే దీనికోసం టైం ఎక్కువ తీసుకోవడానికి కూడా అతను ఆలోచించడు.

ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో కూడా ఇదే జరగనుంది. ఈ సినిమా విషయంలో రాజమౌళికి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు నిర్మాతలు. హీరో మహేష్ బాబు తన పారితోషికం గురించి ఆలోచించకుండా.. అప్పుడెప్పుడో ‘పోకిరి’ టైంలో తీసుకున్న అడ్వాన్స్ కే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో నటీనటులంతా ఇలా దర్శకుడికి నిర్మాతకి కోపరేట్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్ ఎంత బాగా వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘వారణాసి’ సినిమాకి దాదాపు రూ.800 కోట్లు బడ్జెట్ అవుతుంది అనేది సోషల్ మీడియా టాక్. దానికి ఇంకో రూ.200 కోట్లు, రూ.300 కోట్లు అదనంగా ఖర్చైనా ఆశ్చర్యపోనవసరం లేదు అనే చెప్పాలి. ఆ మొత్తాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలో రాజమౌళికి బాగా తెలుసు. ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘వారణాసి’ కి రూ.600 కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి రాజమౌళి నో చెప్పడం కూడా జరిగింది.

తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus