Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే విలన్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తుండగా, ఈ మూవీలో నటించే నటులు ఒక్కొకరుగా యాడ్ అవుతున్నట్టు రోజుకొక వార్త ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది. అయితే రీసెంట్ గా మహేష్ బాబు కి తండ్రిగా ఒక విలక్షణ నటుడు నటించబోతున్నట్టు, ఇది వరకే వీరిద్దరూ తండ్రి కొడుకులాగ పలు హిట్ సినిమాల్లో నటించారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో చూసేద్దాం. 

Prakash Raj 

మహేష్ బాబు కెరీర్లోనే బ్లాక్ బస్టర్ చిత్రాలైన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి సినిమాలలో మహేష్ కు తండ్రిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించారు. ఇప్పుడు రీసెంట్ గా మహేష్ కెరీర్లోనే భారీ చిత్రమైన ‘వారణాసి’ లో ప్రకాష్ రాజ్ హీరో తండ్రిగా  నటించబోతున్నాడు అని సమాచారం. ఆల్రెడీ వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అవ్వటంతో భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ మూవీ హైప్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. 

ఇది ఇలా ఉండగా ‘వారణాసి’ మూవీ లో మహేష్ మొత్తం 5 పాత్రలలో కనపడబోతున్నారని ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తూ ట్రేండింగ్ లో ఉంది. ఇలా ఒకదానికి మించిన అప్డేట్ ఇంకోటి యాడ్ అవుతూ వారణాసి చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. 

Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus