ఈ దశాబ్దంలో వచ్చిన విభిన్న ప్రేమ కథా సినిమాలు

  • July 28, 2017 / 10:39 AM IST

ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, గీతాంజలి, తొలి ప్రేమ, నువ్వే కావాలి… ఈ సినిమా పేర్లు చెప్పగానే తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అదే ప్రేమకథల్లోని గొప్పతనం. తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ప్రేమ కథ చిత్రాలు మనల్ని అలరించాయి. రీసెంట్ గా అంటే గత పదేళ్లలో వినూత్న ప్రేమ కథలతో మెప్పించిన కొన్ని సినిమాలపై ఫోకస్…

నిన్ను కోరి నేచురల్ స్టార్ నాని చేసిన ప్రేమ కథా చిత్రాల్లో నిన్నుకోరి ప్రత్యేకమైంది. ఇందులో నాని, నివేత, ఆది మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ కదిలిస్తాయి. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం మంచి బలాన్ని సమకూర్చింది.

వాన కన్నడలో సూపర్ హిట్ అయిన ముంగారు మాలే సినిమాని ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో “వాన”గా రీమేక్ చేశారు. వినయ్ రాయ్, మీరా చోప్రా జంటగా నటించిన ఈ మూవీ అందరి కంట కన్నీరు తెప్పించింది.

ఓయ్ లవర్ బాయ్ సిద్దార్ధ్ చేసిన ట్రాజడీ లవ్ స్టోరీ “ఓయ్”. ఆనంద రంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షామిలి నటన అందరినీ ఏడిపించింది. ప్రియురాలి కోరికలు అన్ని తీర్చే ప్రేమికుడిగా సిద్దార్ధ్ బాగా నటించాడు.

ఏ మాయ చేసావే ఈ మధ్య కాలంలో యువత హృదయాలను తాకిన ప్రేమకథ చిత్రం ఏ మాయ చేసావే. ప్రేమికులుగా నాగ చైతన్య, సమంత నటన అద్భుతం. గౌతమ్ మీనన్ దర్శకత్వానికి తోడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాని ఆణిముత్యంగా మార్చాయి.

అందాల రాక్షసి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎన్నో వచ్చాయి .. హిట్ అందుకున్నాయి. అదే బాటలో కొత్త కోణాన్ని చూపించిన సినిమా అందాల రాక్షసి. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముగ్గురూ ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. డైరక్టర్ హను రాఘవపూడికి కూడా ఇది తొలిసినిమా కావడం విశేషం.

ఎందుకంటే ప్రేమంటతెలుగు చిత్ర పరిశ్రమలో ఇది వరకు రాని కథ తో తెరకెక్కిన మూవీ ఎందుకంటే ప్రేమంట. ఈ చిత్రంలో గత జన్మలోని ప్రేమ, ఈ జన్మలో మళ్ళీ చిగురించడాన్ని కొత్తగా చూపించారు. రామ్, తమన్నాలు ప్రేమికులుగా చక్కగా నటించి గుర్తుండిపోయేలా చేశారు.

ఆరెంజ్ ఓ రేంజ్ లవ్ స్టోరీ ఆరెంజ్. ప్రేమను కొత్తగా నిర్వచించిన ఈ మూవీ ఆర్ధికంగా విజయం సాధించకపోయినప్పటికీ విభిన్నమైన ప్రేమ కథ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులో రామ్ చరణ్, జెనీలియాల నటన యువతను ఆకట్టుకుంది.

ఎటో వెళ్లిపోయింది మనసు దర్శకుడు గౌతమ్ మీనన్ నుంచి వచ్చిన మరో అద్భుత ప్రేమ కథ చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు”. ఇది తెలుగు, తమిళంలో ఒకే సారి తెరకెక్కింది. కథ ఒకటే.. పాత్రలు మారుతారు అంతే. తెలుగు వెర్షన్ లో నేచురల్ స్టార్ నాని, సమంతలు సూపర్ గా నటించి మెప్పించారు.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు నిజమైన ప్రేమ ఎన్ని ఏళ్ళు అయినా ఎదురుచూస్తుంది అనే విషయాన్నీ కళ్ళకు కట్టిన మూవీ “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. శర్వానంద్, నిత్యా మీనన్ నటనకు తోడు సాయి మాధవ్ బుర్ర రాసిన మాటలు మనసుకు హత్తుకున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus