Varsha Bollamma: ‘స్వాతి ముత్యం’ హీరోతో పెళ్లి రూమర్స్.. వర్ష ఏమందంటే?

వర్ష బొల్లమ్మ పరిచయం అవసరం లేని పేరు. ‘బిగిల్'(తెలుగులో ‘విజిల్’) సినిమాలో ఓ ప్లేయర్ గా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి తెలుగులో… మంచి ఆఫర్లే వస్తున్నాయి. ఇప్పటికే ‘జాను’ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ‘పుష్పక విమానం’ ‘స్టాండప్ రాహుల్’ ‘స్వాతి ముత్యం’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. త్వరలో రాబోతున్న సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ లో కూడా ఈమెనే హీరోయిన్. ఆ సినిమాలో ఈమె పాత్ర ఊహించని విధంగా ఉంటుందట.

ట్రైలర్లో కూడా ఆమె నెగిటివ్ షేడ్స్ రోల్ చేసినట్టు హింట్ ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమా అటు సందీప్ కిషన్ కి.. ఇటు వర్ష బొల్లమ్మకి మంచి పేరు తెచ్చిపెడుతుంది అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వర్ష బొల్లమ్మపై మొన్నామధ్య పెళ్లి రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ‘స్వాతి ముత్యం’ హీరో బెల్లంకొండ గణేష్ తో ఈమె ప్రేమాయణం నడుపుతుందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై గణేష్ స్పందించి..’ఆమె నా ఫ్రెండ్ మాత్రమే’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు వర్ష (Varsha Bollamma) కూడా ఆ రూమర్స్ పై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఆ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో నాకే తెలీదు. నేను కూడా వాటిని చూశాను. కానీ అతనితో నేను మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువ. పోనీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కలిసి ఉన్న ఫోటోలు వంటివి చూసి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అంటే అదో రకం. అతను మంచి అబ్బాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ‘నో ఫైర్ నో స్మోక్’ ‘ అంటూ చెప్పుకొచ్చింది వర్ష బొల్లమ్మ.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus