Varsha, Emmanuel: మరోసారి ఇమ్మానుయేల్ పై ప్రేమ కురిపించిన వర్ష!

బుల్లితెర పై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి పరిచయం అవసరం లేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో జంటల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మీ సుధీర్ జంట బాగా ఫేమస్ అయ్యింది. అయితే వీరితోపాటు వర్ష ఇమ్మానుయేల్,రాకేష్ సుజాత వంటి వారిని కూడా జంటలుగా చూపెడుతూ వీరి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ వర్ష ఇమ్మానియేల్ వంటి తదితరులు ఒక స్కిట్ చేశారు.ఇందులో గెటప్ శీను యముడి పాత్రలో నటించగా ఆటో రాంప్రసాద్ తన అనుచరుడి పాత్రలో సందడి చేశారు. ఇక వర్ష ఇమ్మానియేల్ భూమిపై తప్పులు చేయటం వల్ల వారిద్దరిని నరకానికి తీసుకువెళ్తారు. ఇలా నరకంలో వర్షా ఇమ్మానియేల్ కు శిక్ష విధించబోతుండగా వీరిద్దరిని చూస్తుంటే చాలా డేంజర్ గా ఉన్నారని చెప్పడంతో గెటప్ శీను కూడా అవును డేంజర్ గానే ఉన్నారని చెప్పగా ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు.

శిక్షణ నుంచి విముక్తి కావాలంటే మీరు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుందని గెటప్ శీను వారికి ఒక టాస్క్ ఇచ్చారు. శిక్ష నుంచి విముక్తి కావాలంటే మీ మధ్య ఉన్న ప్రేమ నిజమైనదని నిరూపించుకోవాలి అంటారు. ఇదే అవకాశంగా భావించిన వర్ష ఇమ్మానుయేల్ పై తనకున్న ప్రేమను మరోసారి బయట పెట్టారు. ఈ సందర్భంగా ఇమ్మానుయేల్ ను ఉద్దేశిస్తూ ఇమ్ము మనిద్దరి గురించి అందరికీ ఒక డౌట్ ఉంది. ఏంటి వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా అని అనుమానం అందరిలోనూ ఉంది.

మనం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ.. ఇమ్ము కాదన్న రోజు వర్ష ఊపిరి ఆగిపోతుంది అంటూ ఈమె మరోసారి తనపై ప్రేమను వ్యక్తపరిచారు.వర్షా ఇలా చెప్పేసరికి ఒక్కసారిగా ఇమ్మానుయేల్ సంతోషం వ్యక్తం చేయగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకే ఒక లోకం నువ్వు అనే పాటను వేయడం మరింత హైలెట్ అయింది. అయితే ఇదంతా కూడా కేవలం టిఆర్పి కోసమేనని ఈ ప్రోమో చూస్తున్న వాళ్లు భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus