Varudu Kaavalenu Collections: కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిన ‘వరుడు కావలెను’..!

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘వరుడు కావలెను’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టే మంచి టాక్ ను కూడా సొంతం చేసుకుంది ఈ చిత్రం. కానీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయింది ఈ చిత్రం.

క్లోజింగ్ కలెక్షన్లని ఓసారి గమనిస్తే :

నైజాం 1.30 cr
సీడెడ్ 0.52 cr
ఉత్తరాంధ్ర 0.55 cr
గుంటూరు 0.37 cr
ఈస్ట్ 0.31 cr
వెస్ట్ 0.26 cr
కృష్ణా 0.34 cr
నెల్లూరు 0.23 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.88 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 Cr
ఓవర్సీస్ 0.98 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.08 cr

‘వరుడు కావలెను’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.5.08 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.3.47 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు అయ్యింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus