‘రెమో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్… ఆ తర్వాత అతని సినిమాలు కొన్ని డబ్బింగ్ అయినా పెద్దగా ఆడలేదు. అయితే ఇటీవల వచ్చిన ‘వరుణ్ డాక్టర్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్. స్టూడియోస్ అధినేత కోటపాడి జె. రాజేష్… ‘గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘ఎస్.కె. ప్రొడక్షన్స్’ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న ఏక కాలంలో విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం మౌత్ టాక్ పైనే ఆధారపడి తర్వాత పుంజుకుంది.
ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.65 cr
సీడెడ్
0.38 cr
ఉత్తరాంధ్ర
0.35 cr
ఈస్ట్
0.23 cr
వెస్ట్
0.18 cr
గుంటూరు
0.27 cr
కృష్ణా
0.24 cr
నెల్లూరు
0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.45 cr
‘వరుణ్ డాక్టర్’ చిత్రానికి తెలుగులో రూ.1.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.1.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆ టార్గెట్ ను మొదటి వారమే ఫినిష్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి రూ.2.45 కోట్ల షేర్ ను రాబట్టి…బయ్యర్లకు రూ.1.20 కోట్ల వరకు లాభాలను అందించింది.