బిగ్ బాస్ విన్నర్ పై ‘కౌశల్ ఆర్మీ’ ఎఫెక్ట్..!

  • October 30, 2019 / 06:09 PM IST

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో విన్నర్ ఎవరనేది అందరికీ తెలిసిపోతుంది. తమ అభిమాన కంటెస్టెంట్ ను విన్నర్ ను చేయడానికి ప్రేక్షకులు కూడా ప్రొమోషన్ లు గట్టిగానే చేస్తున్నారు. ‘టాప్ 5’ కంటెస్టెంట్స్ లో రాహుల్, వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా ఉన్నారు. ఇక ఇప్పటి వరకూ రాహుల్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అయితే రాహుల్ దగ్గరగా వరుణ్ సందేశ్ కూడా ఉన్నాడు. శ్రీముఖి ఫ్యాన్స్ ఓ రేంజ్లో ప్రమోషన్లు చేస్తున్నప్పటికీ వరుణ్ కి సడెన్ ఓట్లు పెరగడంతో అంతా ఆశ్చర్యబోతున్నారు.

దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. ‘బిగ్ బాస్2’ విన్నర్ కౌషల అని తెలుస్తుంది. విషయం ఏంటంటే… ఇటీవల కౌశల్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో కౌశల్ మాట్లాడుతూ ” ‘బిగ్ బాస్3’ విన్నర్ ఎవరనేది మీచేతిలోనే ఉంటుంది. నా ఫేవరెట్ అన్నంత మాత్రాన.. టైటిల్ విన్నర్ అయిపోరు అంటూ ‘బిగ్ బాస్3’ టాప్5 కంటెస్టెంట్స్ అందరి గురించి మాట్లాడాడు. అయితే వరుణ్ చాలా ‘లవబుల్ గాయ్’. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అందరి మనసులు గెలుచుకున్నాడు’ అంటూ కాస్త డోస్ ఎక్కువేసి చెప్పాడు. దీంతో ‘కౌశల్ ఆర్మీ’ చాలా వరకూ వరుణ్ సందేశ్ కు సపోర్ట్ చేస్తూ ఓట్లు వేస్తున్నారు. ఇప్పటి వరకూ పోటీ అంతా ‘రాహుల్ Vs శ్రీముఖి’ అన్నట్టు ఉంటుంది అంతా అనుకుంటే.. కౌశల్ కామెంట్స్ తో వరుణ్ చాలా వరకూ లీడ్ పోసిషన్ కు వచేసాడనే చెప్పాలి. మరి చివరికి ఏం జరుగుతుంది చూద్దాం..!

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus