Varun , Lavanya: వామ్మో పెళ్లి కోసం నాగబాబు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈయన నటి లావణ్య త్రిపాఠిని నవంబర్ ఒకటవ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వీరి వివాహం ఇటలీలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. 3 రోజులపాటు జరిగినటువంటి ఈ పెళ్లి వేడుకలలో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా గడిపారు.

ఈ విధంగా వరుణ్ తేజ్ వివాహం అక్టోబర్ 30వ తేదీ మొదలై నవంబర్ 1వ తేదీ వరకు ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సంగీత్ నుంచి మొదలుకొని హల్దీ మెహందీ వేడుకలు కూడా ఎలాంటి లోటు లేకుండా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ విధంగా వరుణ్ లావణ్య పెళ్లి వేడుక ఎంతో కన్నుల పండుగగా జరగాయి. ఇటలీలో ఇంత ఘనంగా పెళ్లి చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి కోసం ఎంత మొత్తంలో ఖర్చు అయ్యిందనే విషయం గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. తన కొడుకు పెళ్లి లో ఎక్కడా కూడా ఎలాంటి లోటు లేకుండా ఉండడం కోసం నాగబాబు అన్ని ఏర్పాట్లు చేశారట ఇలా ప్రతి ఒక్క వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ తన కొడుకు పెళ్లిని ఎంతో ఘనంగా చేశారని తెలుస్తుంది. అయితే ఇటలీలో వరుణ్ తేజ్ (Varun) లావణ్య త్రిపాఠి పెళ్లి చేయడం కోసం సుమారు 17 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యాయని సమాచారం.

ఇలా మూడు రోజులపాటు ఈ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించినందుకు దాదాపు 17 కోట్ల రూపాయల ఖర్చు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇలా పెళ్లి కోసమే కాకుండా హైదరాబాదులో నవంబర్ 5వ తేదీ నిర్వహించే రిసెప్షన్ కూడా ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా రాబోతున్నట్లు సమాచారం.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus