Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » ఇంటర్వ్యూలు » ఇంటర్వ్యూ : ‘ఆపరేషన్ వాలెంటైన్’ గురించి వరుణ్ తేజ్ చెప్పిన ఆసక్తికర విషయాలు!

ఇంటర్వ్యూ : ‘ఆపరేషన్ వాలెంటైన్’ గురించి వరుణ్ తేజ్ చెప్పిన ఆసక్తికర విషయాలు!

  • February 28, 2024 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంటర్వ్యూ : ‘ఆపరేషన్ వాలెంటైన్’ గురించి వరుణ్ తేజ్ చెప్పిన ఆసక్తికర విషయాలు!

వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఈ శుక్రవారం అనగా మార్చి 1న రిలీజ్ కాబోతుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. మానుషి చిల్లర హీరోయిన్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం :

‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?

వరుణ్ తేజ్ :  దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్ తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ అది కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. వాళ్ళు కూడా అన్నీ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ అప్పీల్ వున్న కంటెంట్ ఇది. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్ ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం.

ప్ర) బాలీవుడ్ మేకర్స్ ఇన్వాల్వ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరకి ఎలా వచ్చింది?

వరుణ్ తేజ్ : ముంబైలో ఉండే ఈ సినిమా టీం.. హీరో కోసం అన్వేషిస్తున్న టైంలో మా మేనేజర్ ని కాంటాక్ట్ చేయడం, అతను నా గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కథ విని నచ్చడంతో ఫైనల్ చేశాను.

ప్ర) ఇలాంటి వార్ బ్యాక్ డ్రాప్ సినిమా కొత్త డైరెక్టర్ తో చేయడం ఛాలెంజింగా అనిపించలేదా?

వరుణ్ తేజ్ : డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ సినిమా పై చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఛాన్స్ ఉంది కదా అని ఏదో ఒక సినిమా చేసేయాలి అని అనుకోడు. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు.ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పై అతను ఓ షార్ట్ ఫిలిం తీశాడు. వాళ్ళు ఇది చూసి షాకైపోయి.. దీనిని సినిమాగా చేయాలనుకుంటే మాకు చెప్పండి.. ఇంకా సమాచారం ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వీఎఫ్ఎక్స్ పై కూడా అతనికి చాలా మంచి పట్టు వుంది. నటీనటుల నుండి మంచి పెర్ఫార్మెన్స్ ని రాబట్టుకునే నైపుణ్యం కూడా అతనికి ఉంది.

ప్ర) ఈ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’అనే టైటిల్ పెట్టడం, జనాలకి ఎంతవరకు రీచ్ అయ్యింది అనుకున్నారు?

వరుణ్ తేజ్ : 2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకున్నాయి. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎటాక్ ప్లాన్ చేశారు. మా ఈ సినిమాలో వాలెంటైన్ అనేది ప్రతి ఒక్కరికీ దేశం పై వున్న ప్రేమని తెలుపుతుంది.

ప్ర) ముందుగానే ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారా.. లేదా తర్వాత మార్చారా?

వరుణ్ తేజ్ : వాస్తవానికి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ‘రుద్ర’ కాబట్టి.. దానినే టైటిల్ గా పెట్టాలని అనుకున్నాం. కానీ దాని వల్ల ఈ సినిమా నేపధ్యం ఇది అని ఎంత వరకు తెలుస్తుంది? అందుకే ‘ఆపరేషన్ వాలంటైన్’ అని పెట్టాం.

ప్ర) సినిమా కంప్లీట్ అయ్యాక ‘ఎయిర్ ఫోర్స్’ వాళ్లకి ఏమైనా ఫైనల్ కాపీని చూపించారా?

వరుణ్ తేజ్ : ఎస్.. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించడం జరిగింది. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ది బెస్ట్ అని వాళ్ళు అన్నారు. ప్రతి భారతీయుడు

ప్ర) వి.ఎఫ్.ఎక్స్ సినిమాలకి ఏంటి అంటే నటీనటులకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కష్టం అవుతుంది అంటారు.. మీకు కూడా అలా అనిపించిందా?

వరుణ్ తేజ్ : అంతరిక్షం సినిమా టైంలో మొదటిసారి వీఎఫ్ఎక్స్ ని ఎక్స్ పీరియన్స్ చేశా. గ్రీన్ స్క్రీన్ చూపించి అక్కడే చంద్రుడు ఉన్నాడని చెబితే ఇబ్బందిగా ఉండేది(నవ్వుతూ). రానురాను అది అలవాటైయింది. ఈ సినిమా విషయానికి వస్తే అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్ లో వెళుతుంది, ఎలా మలుపుతిరుగుతుంది ఇవన్నీ ముందే ఒక పైలెట్ ని అడిగి తెలుసుకున్నా. అందువల్ల ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు.

ప్ర) ఇది ద్విభాషా చిత్రం.. ఒకేసారి తెలుగు, హిందీలో చేయడం ఎలా అనిపించింది?

వరుణ్ తేజ్ : హిందీ నేర్చుకోవడం కోసం 2 నెలలు క్లాసులకి వెళ్ళాను. డిక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్ ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి.(నవ్వుతూ)

ప్ర) హీరోయిన్ మానుషి చిల్లర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

వరుణ్ తేజ్ : మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్ గా నిలిచి దేశానికి పేరు తీసుకొచ్చారు.ఈ సినిమాలో రాడర్ ఆఫీసర్ గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది.

ప్ర) మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి ?

వరుణ్ తేజ్ : మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఈ సినిమా కోసం దర్శకుడే మిక్కీ అయితే బావుంటుందని అన్నారు. ఇందులో పాటలు కథకి తగ్గట్టు ఉంటాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుల మూడ్ ను డైవర్ట్ చేసేలా ఉండవు.

ప్ర) ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి చూపించారా?

వరుణ్ తేజ్ : టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాబాయ్ ని కలిశాను. ఆయన సినిమాల గురించి ఎక్కువ మాట్లాడరు. బాగుంది, గుడ్.. ఇంతవరకే ఉంటుంది ఆయన రియాక్షన్. అలాంటి ఆయన ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ ని 5సార్లు చూశారు. ‘చాలా బావుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా చాలా బాగా కనిపిస్తున్నావ్. సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను’ అన్నారు. ఇలాంటి సినిమాలు ఆయనకి నచ్చుతాయి.

ప్ర) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చారు?

వరుణ్ తేజ్ : నా ఫస్ట్ సినిమాకి ఆయన వచ్చారు. ఆ తర్వాత ఏ సినిమాకి కూడా నేను ఆయన్ని నా సినిమా ఫంక్షన్స్ కి రా అని నేను అడగలేదు. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అలాంటి పెద్ద ఇమేజ్ ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని భావించి.. నేను పెదనాన్న గారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా వెంటనే ఓకే అన్నారు.

ప్ర) ‘మట్కా’ సినిమా ఎలా వుండబోతుంది?

వరుణ్ తేజ్ : ‘మట్కా’ లో నాది (Varun Tej) ఎక్కువ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. అది మంచి కమర్షియల్ రివెంజ్ డ్రామా.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Operation Valentine
  • #Varun Tej

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

6 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

11 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

12 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

1 day ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

1 day ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version