వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఈ శుక్రవారం అనగా మార్చి 1న రిలీజ్ కాబోతుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. మానుషి చిల్లర హీరోయిన్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం :
‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?
వరుణ్ తేజ్ : దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్ తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ అది కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. వాళ్ళు కూడా అన్నీ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ అప్పీల్ వున్న కంటెంట్ ఇది. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్ ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం.
ప్ర) బాలీవుడ్ మేకర్స్ ఇన్వాల్వ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరకి ఎలా వచ్చింది?
వరుణ్ తేజ్ : ముంబైలో ఉండే ఈ సినిమా టీం.. హీరో కోసం అన్వేషిస్తున్న టైంలో మా మేనేజర్ ని కాంటాక్ట్ చేయడం, అతను నా గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కథ విని నచ్చడంతో ఫైనల్ చేశాను.
ప్ర) ఇలాంటి వార్ బ్యాక్ డ్రాప్ సినిమా కొత్త డైరెక్టర్ తో చేయడం ఛాలెంజింగా అనిపించలేదా?
వరుణ్ తేజ్ : డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ సినిమా పై చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఛాన్స్ ఉంది కదా అని ఏదో ఒక సినిమా చేసేయాలి అని అనుకోడు. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడు.ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పై అతను ఓ షార్ట్ ఫిలిం తీశాడు. వాళ్ళు ఇది చూసి షాకైపోయి.. దీనిని సినిమాగా చేయాలనుకుంటే మాకు చెప్పండి.. ఇంకా సమాచారం ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వీఎఫ్ఎక్స్ పై కూడా అతనికి చాలా మంచి పట్టు వుంది. నటీనటుల నుండి మంచి పెర్ఫార్మెన్స్ ని రాబట్టుకునే నైపుణ్యం కూడా అతనికి ఉంది.
ప్ర) ఈ సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’అనే టైటిల్ పెట్టడం, జనాలకి ఎంతవరకు రీచ్ అయ్యింది అనుకున్నారు?
వరుణ్ తేజ్ : 2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకున్నాయి. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎటాక్ ప్లాన్ చేశారు. మా ఈ సినిమాలో వాలెంటైన్ అనేది ప్రతి ఒక్కరికీ దేశం పై వున్న ప్రేమని తెలుపుతుంది.
ప్ర) ముందుగానే ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారా.. లేదా తర్వాత మార్చారా?
వరుణ్ తేజ్ : వాస్తవానికి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ‘రుద్ర’ కాబట్టి.. దానినే టైటిల్ గా పెట్టాలని అనుకున్నాం. కానీ దాని వల్ల ఈ సినిమా నేపధ్యం ఇది అని ఎంత వరకు తెలుస్తుంది? అందుకే ‘ఆపరేషన్ వాలంటైన్’ అని పెట్టాం.
ప్ర) సినిమా కంప్లీట్ అయ్యాక ‘ఎయిర్ ఫోర్స్’ వాళ్లకి ఏమైనా ఫైనల్ కాపీని చూపించారా?
వరుణ్ తేజ్ : ఎస్.. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించడం జరిగింది. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ది బెస్ట్ అని వాళ్ళు అన్నారు. ప్రతి భారతీయుడు
ప్ర) వి.ఎఫ్.ఎక్స్ సినిమాలకి ఏంటి అంటే నటీనటులకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కష్టం అవుతుంది అంటారు.. మీకు కూడా అలా అనిపించిందా?
వరుణ్ తేజ్ : అంతరిక్షం సినిమా టైంలో మొదటిసారి వీఎఫ్ఎక్స్ ని ఎక్స్ పీరియన్స్ చేశా. గ్రీన్ స్క్రీన్ చూపించి అక్కడే చంద్రుడు ఉన్నాడని చెబితే ఇబ్బందిగా ఉండేది(నవ్వుతూ). రానురాను అది అలవాటైయింది. ఈ సినిమా విషయానికి వస్తే అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్ లో వెళుతుంది, ఎలా మలుపుతిరుగుతుంది ఇవన్నీ ముందే ఒక పైలెట్ ని అడిగి తెలుసుకున్నా. అందువల్ల ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు.
ప్ర) ఇది ద్విభాషా చిత్రం.. ఒకేసారి తెలుగు, హిందీలో చేయడం ఎలా అనిపించింది?
వరుణ్ తేజ్ : హిందీ నేర్చుకోవడం కోసం 2 నెలలు క్లాసులకి వెళ్ళాను. డిక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్ ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి.(నవ్వుతూ)
ప్ర) హీరోయిన్ మానుషి చిల్లర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
వరుణ్ తేజ్ : మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్ గా నిలిచి దేశానికి పేరు తీసుకొచ్చారు.ఈ సినిమాలో రాడర్ ఆఫీసర్ గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది.
ప్ర) మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి ?
వరుణ్ తేజ్ : మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఈ సినిమా కోసం దర్శకుడే మిక్కీ అయితే బావుంటుందని అన్నారు. ఇందులో పాటలు కథకి తగ్గట్టు ఉంటాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుల మూడ్ ను డైవర్ట్ చేసేలా ఉండవు.
ప్ర) ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి చూపించారా?
వరుణ్ తేజ్ : టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాబాయ్ ని కలిశాను. ఆయన సినిమాల గురించి ఎక్కువ మాట్లాడరు. బాగుంది, గుడ్.. ఇంతవరకే ఉంటుంది ఆయన రియాక్షన్. అలాంటి ఆయన ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ ని 5సార్లు చూశారు. ‘చాలా బావుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా చాలా బాగా కనిపిస్తున్నావ్. సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను’ అన్నారు. ఇలాంటి సినిమాలు ఆయనకి నచ్చుతాయి.
ప్ర) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చారు?
వరుణ్ తేజ్ : నా ఫస్ట్ సినిమాకి ఆయన వచ్చారు. ఆ తర్వాత ఏ సినిమాకి కూడా నేను ఆయన్ని నా సినిమా ఫంక్షన్స్ కి రా అని నేను అడగలేదు. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అలాంటి పెద్ద ఇమేజ్ ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని భావించి.. నేను పెదనాన్న గారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా వెంటనే ఓకే అన్నారు.
ప్ర) ‘మట్కా’ సినిమా ఎలా వుండబోతుంది?
వరుణ్ తేజ్ : ‘మట్కా’ లో నాది (Varun Tej) ఎక్కువ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. అది మంచి కమర్షియల్ రివెంజ్ డ్రామా.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!