Varun Tej: ఈ టైంలో రిస్క్ అవసరమా.. వరుణ్ తేజ్…!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం ఫామ్లో లేడు. కోవిడ్ తర్వాత ఇతను చేసిన సినిమాల్లో ‘ఎఫ్3’ (F3 Movie) మినహా ఇంకో హిట్టు లేదు. ‘ఎఫ్ 3’ సక్సెస్ కూడా వరుణ్ తేజ్ ఖాతాలో పూర్తిగా పడలేదు. ఎందుకంటే అందులో చాలా వరకు క్రెడిట్ వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) ..లకి వెళ్ళింది. ‘గని’ (Ghani) ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna)  ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) వంటి చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి. ఈ వారం ‘మట్కా’  (Matka) రిలీజ్ కాబోతుంది. దానిపై కూడా అంతంత మాత్రమే అంచనాలు ఉన్నాయి.

Varun Tej

ఇదిలా ఉండగా.. ప్లాపుల్లో ఉన్నప్పటికీ వరుణ్ తేజ్ తన పంధా మార్చుకోవడం లేదు. సాధారణంగా ఇలాంటి టైంలో కొంచెం గ్యాప్ తీసుకుని మినిమమ్ గ్యారంటీ అనుకునే దర్శకులతో సినిమాలు చేస్తుంటారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ప్లాప్ దర్శకులకే ఓకే చెబుతూ పోతున్నాడు. ‘మట్కా’ తర్వాత వరుణ్ తేజ్.. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇది హారర్ బ్యాక్ డ్రాప్లో రూపొందే స్టోరీ అని తెలుస్తుంది.

దీని కోసం ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారట. అంతే కాదు రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందనుంది అని తెలుస్తుంది. హీరో, హీరోయిన్స్ తో పాటు.. ఈ సినిమాలో మిగిలిన నటీనటులు కూడా రాయలసీమ యాసలోనే మాట్లాడతారట. మెగా హీరోల్లో ఒక్క సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) (విరూపాక్ష) (Virupaksha) తప్ప.. హారర్ జోనర్లో ఇంకెవ్వరూ సినిమాలు చేయలేదు. ఆ రకంగా చూస్తే ఇది స్పెషల్ మూవీనే అనుకోవాలి.

కానీ మేర్లపాక గాంధీ గత చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ (Like Share Subscribe) పెద్ద డిజాస్టర్ అయ్యింది. మరోపక్క విక్రమ్ సిరికొండ (Vikram Sirikonda)  దర్శకత్వంలో కూడా వరుణ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.విక్రమ్ గత చిత్రం ‘టచ్ చేసి చూడు’  (Touch Chesi Chudu) కూడా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ ఇద్దరి ప్లాప్ డైరెక్టర్లతో వరుణ్ తేజ్ చేయబోయే సినిమాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus