సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే సక్సెస్ ముఖ్యమనే సంగతి తెలిసిందే. సినిమా హిట్టైతే వద్దన్నా దర్శకులకు అవకాశాలు వస్తాయి. సినిమా ఫ్లాపైతే మాత్రం కొత్త మూవీ ఆఫర్లు రావడం సులువు కాదని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్క్రీన్ రైటర్ గా, డైరెక్టర్ గా విక్రమ్ సిరికొండకు గుర్తింపు ఉంది. రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కిన టచ్ చేసి చూడు (Touch Chesi Chudu) సినిమాకు విక్రమ్ సిరికొండ (Vikram Sirikonda) దర్శకత్వం వహించారు. బీటెక్ చదివిన ఈ దర్శకుడికి ఫిల్మ్ మేకింగ్ లో సైతం డిప్లొమా ఉంది.
పలు హిట్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా ఆయన పని చేశారు. వరుణ్ తేజ్(Varun Tej) ఈ డైరెక్టర్ చెప్పిన కథను నమ్మి ఛాన్స్ ఇచ్చారని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఆసక్తికర ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సైతం ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. వరుణ్ తేజ్ పారితోషికం మాత్రం ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వరుణ్ తేజ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ జనరేషన్ ప్రేక్షకులను మెప్పించే కథలకు వరుణ్ తేజ్ ప్రాధాన్యత ఇస్తున్నారు.