వీరమ్, కాటమరాయుడు చిత్రాల్లోని ఆసక్తికర సంగతులు

పవన్ కళ్యాణ్ సొంతంగా రాసుకున్న కథతో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ అపజయం పాలవడంతో తమిళంలో విజయం సాధించిన కథనే ఎంచుకున్నారు. తమిళ స్టార్ అజిత్ నటించిన వీరమ్ సినిమాను తెలుగులో కాటమరాయుడుగా తీసుకొస్తున్నారు. ఈ నెల 24 న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ట్రైలర్ శనివారం యూట్యూబ్ లో రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో సన్నివేశాలను చూస్తుంటే వీరమ్ సినిమా కళ్లముందు కనబడుతోంది. మేము గమనించిన వీరమ్, కాటమరాయుడులోని కొన్ని సంగతులను షేర్ చేసుకుంటున్నాం. అవి ఏమిటంటే..

పవర్ ఫుల్ హీరోయిజం వీరమ్ లో అజిత్ మాస్ పల్స్ పట్టేలా నటించారు. అంతే పవర్ ఫుల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా కాటమరాయుడులో కనిపించబోతున్నారు. తొలిసారి పంచెకట్టుతో ఫైట్స్ ఇరగదీయనున్నారు.

ప్రేమ కోసం మార్పు “అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్ .. చాలా చాలా డేంజర్ రోయ్”.. అంటూ చెప్పే కాటమరాయుడుని ఓ ముద్దుగుమ్మ ప్రేమలోకి దింపుతుంది. ఇక తన లైఫ్ లోకి అమ్మాయి ఎంటర్ అయిపోగానే పవన్ లుక్ లో మార్పు వస్తుంది. వీరమ్ లోను అజిత్ ప్రేమలో పడగానే మాసిన గడ్డాన్ని తీసేసి అందంగా తయారవుతాడు.

మనసులాగిన అమ్మాయి ఎవరు ?వీరమ్ లో నిత్యం గొడవలో మునిగిన అజిత్ ని ఆలయాలకు ఆకర్షణ తెచ్చే తమన్నా ఆకర్షిస్తుంది. కాటమరాయుడులో పవన్ ని ముగ్గులోకి దించేది శృతిహాసన్. గబ్బర్ సింగ్ లో పవన్ శృతిని పనిగట్టుకొని ప్రేమలో దింపితే, ఇందులో శృతి పవన్ ని కస్టపడి ప్రేమ మైకంలోకి తీసుకెళుతుంది.

తమ్ముళ్ల ప్లాన్ వీరమ్ లో హీరో తన తముళ్లకోసం ఎన్నో త్యాగాలను చేస్తాడు. ప్రేమ, పెళ్లి వద్దని శ్రమిస్తుంటాడు. అదే తమ్ముళ్లకు ఇబ్బంది అవుతుంది. అన్నకి కూడా ఓ అందమైన వదినను సెట్ చేస్తే సమస్య తీరిపోతుంది. కాబట్టి అన్న పక్కన ఉంటూ వదినకు సహరిస్తుంటారు తమ్ముళ్లు. వీరమ్ లో మాదిరిగానే కాటమరాయుడు లో కూడా తమ్ముళ్లే కథని నడిపిస్తారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

కామెడీ మిస్ కాదు ఎప్పుడూ సీరియస్ గా ఉండే హీరో నుంచి కామెడీ పంచ్ లు పడాలంటే, పక్కన ఉండే స్నేహితుడు చేసే పనులు సరదాగా ఉండాలి. అజిత్ కి పెళ్లి సంబంధాలు చూసే పాత్రలో తమిళ హాస్యనటుడు నవ్వించగా, అదే పాత్రను ఇక్కడ అలీ నవ్వులు పంచడానికి సిద్ధంగా ఉన్నారు.

బరువైన పాత్రవీరమ్ లో హీరోయిన్ తండ్రి పాత్రను నాజర్ పోషించారు. హీరోలో మార్పుకు కారణం అతనే. మంచి మనిషిగా, గొడవలను వద్దని సూచించే వ్యక్తిగా సినిమాలో బరువైన పాత్రను పోషించారు. ఆ క్యారక్టర్ ని తెలుగులోనూ నాజర్ పోషించారు. పాత్రకు న్యాయం చేసే విషయంలో నాజర్ ని సందేహించనవసరం లేదు.

చిన్న మామ హంగామా పవన్ కి మామయ్యగా నాజర్ హుందాగా ఉంటారు. గౌరవాన్ని అందుకుంటారు. ఇక నాజర్ కి తమ్ముడిగా పృద్విరాజ్ తన స్టైల్లో హంగామా చేసి సెకండాఫ్ లో కితకితలు పెట్టించనున్నారు. వీరమ్ లో అజిత్ కి చిన మామగా చేసిన పాత్ర బాగా ఆకట్టుకుంది. ఆ క్యారక్టర్ కాటమరాయుడులోను అలరిస్తుందని ఆశిస్తున్నాం.

పాప కోసం ఫైట్ హైలెట్ నాజర్ కి అమ్మాయితో పాటు ఒక అబ్బాయి కూడా ఉంటాడు. అతను తండ్రికి పూర్తిగా విరుద్ధం. ఎప్పుడూ గొడవలకు దిగుతుంటాడు. అదే గొడవల్లో చనిపోతాడు. అతనికి కూతురు ఉంటుంది. ఆ అమ్మాయిని నాజర్ పెంచుతుంటాడు. ఆ పాప ని శత్రువులు చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ చిన్నారిని రక్షించే ఫైట్ సినిమాలో హైలెట్. తెలుగులోనూ ఆ ఫైట్ ఉందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

భయంకరమైన విలన్ వీరమ్ లో విలన్ గా ప్రదీప్ రావత్ నటించారు. తెలుగులో ప్రదీప్ రావత్ కి తోడు రావు రమేష్ కూడా జోడయ్యారు. పవర్ ఫుల్ హీరోకి తగినట్లుగా విలన్లను డైరక్టర్ డాలీ ఫిక్స్ చేశారు. ఇక ఫైట్స్ వీరమ్ లో కంటే కాటమరాయుడు లోనే ఎక్కువగా ఉంటాయని అనిపిస్తోంది.

కుటుంబ కథా చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే కాటమరాయుడులో కేవలం ఫ్యాక్షన్ ఒక్కటే ఉంటుందని అనుకుంటే పొరబాటే. అన్నదమ్ముల అనుబంధం, వారి జీవితంలోకి వచ్చే అమ్మాయిలు, ఆ అమ్మాయిల పేరెంట్స్ తో కలిసి విందు భోజనాలు ప్రేక్షకుడికి కనువిందు చేస్తాయి.

కుటుంబసభ్యులందరూ కలిసి చూసేందుకు కావాల్సిన అన్ని అంశాలు కాటమరాయుడులో ఉన్నాయని ట్రైలర్ తెలుపుతోంది. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 24 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus