టాలీవుడ్ లో టాలెంట్ తో పాటు టైమింగ్ కూడా ఉండాలి అంటారు….అది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, టాలెంట్ ఉన్న వాడిని మాత్రం ఎవ్వడూ ఆపలేడు అనేది మాత్రం అంతే నిజం. విషయం ఏమిటంటే….టాలీవుడ్ లో కధలు రాసుకుంటూ సొంత కధలతో సినిమాలు తెరకెక్కించే దర్శకులు చాలా తక్కువ, అయితే రచయైటా కధ ఇస్తాడు, లేదంటే తమిళ డబ్బింగ్ సినిమాకు రీమేక్ చేస్తారు తప్పా, సొంతంగా కధలు రాసుకుని సినిమాలు తెరకెక్కించలేరు మన దర్శకులు.
అలా కధతో పాటు దర్శకత్వం కూడా చేసే వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, కొరటాల శివ లాంటి దర్శకులు టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇక అదే క్రమంలో వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరికొందరు రచయితలు కూడా దర్శకుల అవతారం ఎత్తుతున్నారు….అలా దర్శకుడి అవతారం ఎత్తిన ఒక నూతన దర్శకుడి వల్ల కొరటాల షాక్ తిన్నాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే…’బాడీగార్డ్’, ‘పండగ చేస్కో’ వంటి పలు చిత్రాలకు రచయితగా పనిచేనసిన వెలిగొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఈ రచయిత దర్శకుడిగా మారీ ప్రయత్నాలో ఉన్నాడు. తర్వలోనే ఇతను రాజ్ తరుణ్ హీరోగా రూపొందే చిత్రంకి దర్శకుడిగా పనిచేయనున్నారు.
ఈ మూవీని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తారు. అయితే రాజ్ తరుణ్ తోనే కాకుండా మరో టాప్ హీరో మూవీకి సైతం వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పనిచేయనున్నారు. ఇక ఇదే విషయంలో కొరటాల ఎందుకు షాక్ తిన్నాడు అంటే…ఈ మధ్య కాలంలో ఓ టాప్ హీరోవద్దకి సినిమా కోసం వచ్చిన కొరటాల శివకి, ఆ హీరో వెలగొండ శ్రీనివాస్ మూవీకి కమిట్ అయ్యాడని చెప్పాడట, ఇక ఆ మాట విన్న కొరటాల అనుకోని రీతిలో షాక్ తిని అక్కడనుంచి వెళ్లిపోయాడంటా….అందుకే అంటారు టాలెంట్ ఉన్న వాడిని ఎవ్వడూ ఆపలేడు అని.