డైరెక్టర్ అవుతున్న మరో రైటర్!

రచయితలు దర్శకులుగా మారడం అన్నది మన తెలుగు చిత్రసీమలో సర్వసాధారణం. త్రివిక్రమ్ పుణ్యమా అని ఈ ఒరవడి ఈమధ్య బాగా పెరిగిపోయింది. తాజాగా రచయిత వెలిగొండ శ్రీనివాస్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.

ఇటీవల ఒక కథ సిద్ధం చేసుకొని ఎకె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థకు చెప్పాడట, వారికి బాగా నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఉపడంతోపాటు సదరు ప్రోజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. రాజ్ తరుణ్ హీరోగా నటించనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం వెలిగొండ శ్రీనివాస్ స్క్రిప్ట్ ను మెరుగులు దిద్దుతున్నాడట. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్ళనుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus