Venkatesh: దేవుడిగా మారి సినిమా పూర్తి చేశారు!

వెంకటేశ్‌ నెక్స్ట్‌ సినిమా ఏంటి? ఈ విషయం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇది ఆయన హీరోగా నటించే సినిమాల గురించే. ఎందుకంటే వెంకీ హీరోగా కాకుండా ప్రత్యేక పాత్రలు, అతిథి పాత్రలు చేసే సినిమాఉల ఓవైపు షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి, పూర్తి చేసుకుంటున్నాయి కూడా. తాజాగా మరో సినిమా షూటింగ్‌ కూడా పూర్తయిందట. దీంతో వెంకీని త్వరలో థియేటర్లలో చూడొచ్చు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా ‘ఓరి దేవుడా’!

విశ్వక్‌ సేసన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఓరి దేవుడా’. తమిళ మాతృక ‘ఓ మై కడవులే’కి దర్శకత్వం వహించిన అశ్వథ్‌ మరిముత్తు దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో దేవుడి పాత్రలో వెంకటేశ్‌ నటిస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. తమిళంలో ఆ పాత్రలో విజయ్‌ సేతుపతి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇటీవలే రంగంలోకి దిగిన వెంకటేష్‌.. చిత్రీకరణ పూర్తి చేసుకున్నారట. దీంతో సినిమా షూటింగ్‌ కూడా పూర్తయిందట. దీంతో త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని సమాచారం.

ఇంకో వైపు వెంకటేశ్‌ ప్రత్యేక పాత్రలు, అతిథి పాత్రలు చేస్తున్న సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి. సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న ‘కిసీ కీ భాయ్‌ కిసీ కీ జాన్‌’లోనూ వెంకటేశ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ‘కాటమరాయుడు’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ఆ సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్డేకు సోదరుడిగా వెంకీ కనిపిస్తారట. ఈ సినిమాలో వెంకీ పోర్షన్‌ షూటింగ్‌ కూడా పూర్తయిందని సమాచారం. మరోవైపు చిరంజీవి – బాబీ ‘వాల్తేరు వీరయ్య’ ( టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు)లోనూ వెంకటేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

‘వాల్తేరు వీరయ్య’లో ఓ పోలీసు అధికారి పాత్ర ఉందని, అది వెంకీ చేస్తున్నారని టాక్‌. త్వరలోనే ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తారని చెబుతున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడు ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. అయితే వెంకీ హీరోగా కొత్త సినిమా ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus