Venkatesh: వెంకటేశ్‌ కొత్త సినిమా ఇదేనా.. ఫిక్స్‌ చేశారా?

టాలీవుడ్‌ టాప్‌ 4 స్టార్ హీరోస్‌లో ముగ్గురికీ భిన్నంగా ఉన్నది హీరో ఎవరంటే వెంకటేశ్‌ అనే చెప్పాలి. కరోనా ఇచ్చిన గ్యాప్‌ని కవర్‌ చేయడానికి చిరంజీవి వరుస సినిమాలు చేసేస్తున్నారు. బాలకృష్ణ అయితే సినిమా తర్వాత సినిమా అంటూ గ్యాప్‌ ఇవ్వడం లేదు. మధ్యలో ‘అన్‌స్టాపబుల్‌’ చేస్తున్నారు. నాగార్జున అయితే సినిమా లేదంటే బిగ్‌ బాస్‌ అంటూ గ్యాప్‌ లేకుండా పని చేస్తున్నారు. కానీ వెంకీ మాత్రం కొత్త సినిమా ఇంకా ప్రకటించలేదు.

‘ఎఫ్ 3’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించాడు వెంకటేష్. కరోనా టైంలో మిగతా హీరోలతో పోలిస్తే మంచి స్పీడే చూపించాడు. రీమేక్ సినిమాలు ‘నారప్ప’, ‘దృశ్యం 2’ను పూర్తి చేసి రిలీజ్‌ చేసేశాడు. అయితే ఇప్పుడు మాత్రం కొత్త సినిమా మొదలు పెట్టకుండా ఉన్నాడు. కొత్త సినిమాల విషయంలో ఎటూ తేల్చకుండా సైలెంటుగా ఉన్నాడు అంటున్నారు. ప్రస్తుతం వెంకీ దగ్గర ఉన్న పెండింగ్‌లో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి అంటున్నాయి. వాటిలో ఏది ముందుకు తీసుకొస్తారో చూడాలి.

తరుణ్ భాస్కర్‌తో వెంకటేశ్‌ ఇప్పటికే సినిమా చేయాలి. కథ విషయంలో క్లారిటీ మిస్‌ అయ్యి.. గ్యాప్‌ ఇచ్చారు. ఇప్పుడు తరుణ్‌ భాస్కర్‌ కథ కొత్త నెరేషన్‌ సిద్ధం చేస్తున్నారట. వాళ్లిద్దరి మధ్య కథా చర్చలు ఒక కొలిక్కి వస్తే అది మొదలవుతుంది. ఇక ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌తో వెంకీ సినిమా దాదాపు ఓకే అయింది. అయితే ఈలోపు అనుదీప్‌ తమిళ సీమకి వెళ్లి శివకార్తికేయన్‌తో ‘ప్రిన్స్‌’ చేస్తున్నాడు. ఈ సినిమా కొంచెం ఆలస్యమైంది.

ఈ సినిమా తర్వాత అనుదీప్‌ వెంకీ సినిమా పని స్టార్ట్‌ చేస్తారని టాక్‌. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ మీదే ఈ సినిమా ఉంటుందంటున్నారు. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కభీ ఈద్ కభీ దివాలి’లో వెంకీ అతిథి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. ఇందులో పూజా హెగ్డేకు సోదరుడిగా వెంకీ నటిస్తున్నారు. ఈ సినిమాలో పాత్ర చిత్రీకరణ కొంత బ్యాలెన్స్‌ ఉందట. ఆ పని అయ్యాక వేరే సినిమా ఆలోచనలు చేయాలని వెంకీ అనుకుంటున్నారట.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus