Venky75: వెంకటేష్ 75వ మూవీ ‘సైంధవ్’ గ్లింప్స్ ఎలా ఉందంటే..!

‘ఎఫ్3’ తర్వాత విక్టరీ వెంకటేష్ నుండి కొత్త సినిమా ప్రకటన ఏమీ రాలేదు. అయితే కొంత కాలంగా ‘హిట్’ ‘హిట్2’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు రెండు రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. ఇది వెంకటేష్ కు 75వ సినిమా కావడం విశేషంగా చెప్పుకోవాలి. ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సూపర్ హిట్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుపెట్టిన వెంకట్ బోయనపల్లి తన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఈ చిత్రానికి ‘సైంధవ్’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ‘సైంధవ్’ అంటే మహాభారతంలో ఓ క్యారెక్టర్ పేరు. చాలా పవర్ ఫుల్ టైటిల్ అని కూడా తెలుస్తుంది. వెంకటేష్ నుండి రాబోతున్న పక్కా యాక్షన్ మూవీ ఇదని ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశారు. 2 నిమిషాల 16 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ లో.. వెంకటేష్ గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో తుపాకీ పట్టుకుని అతను స్టైలిష్ గా నడిచి వస్తుంటే అందరికీ గత ఏడాది వచ్చిన ‘విక్రమ్’ తాలూకు జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.

గ్లింప్స్ అయితే బాగానే ఉన్నా ఎందుకో ల్యాగ్ అనే ఫీలింగ్ కలిగించింది. సినిమా అయితే ఇలా ఉండకూడదు అని ఆశిద్దాం. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ‘సైంధవ్’ రిలీజ్ కానుంది. ‘దసరా’ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్ ఈ ‘సైంధవ్’ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 26 నుండి ప్రారంభం కానుంది. నటీనటుల వివరాలు కూడా త్వరలో వెల్లడించనున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus