మరో రీమేక్ మూవీతో రానున్న వెంకటేష్
- May 12, 2017 / 01:43 PM ISTByFilmy Focus
ఇతర భాషల్లో విజయం సాధించిన కథలతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్ మరో రీమేక్ మూవీ చేయనున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘జాలీ ఎల్.ఎల్.బీ 2’ హిందీలో రీసెంట్ గా విడుదలై విజయం సాధించింది. ఆమూవీ రీమేక్ హక్కులను నిర్మాత రాధాకృష్ణ తీసుకున్నారు. వెంకటేష్ ఈ మూవీ చేయడానికి ఒకే చెప్పడంతో డైరక్టర్ ఎవరు చేస్తారని ఆలోచనలో ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిసింది. వరుసగా రాధాకృష్ణ కు చెందిన హారిక అండ్ హాసిని బ్యానర్లో సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్ .. ‘జాలీ ఎల్.ఎల్.బీ 2’ ని చెయ్యడానికి ముందు నిరాకరించారట.
వేరే వారి కథను డైరక్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. కానీ రాధాకృష్ణంతో ఉన్న స్నేహంతో అంగీకరించారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత ఎన్టీఆర్ ప్రాజక్ట్ పట్టాలెక్కించనున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ మొదలు కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















