Venkatesh Maha: నెటిజన్లపై చిర్రున లేచిన దర్శకుడు వెంకటేశ్‌ మహా…ఏమైందంటే?

ఇప్పుడు కాదు కానీ… కొన్ని రోజుల క్రితం ఓ బ్లాక్‌బస్టర్ సినిమా మీద యువ టాలీవుడ్‌ దర్శకుడు చేసిన కామెంట్స్‌ వైరల్ అయ్యాయి. ఆ సినిమాలో ఓ పాయింట్‌ను పట్టుకుని ఆయన ఇంకో సినిమా ప్రచారంలో భాగంగా ఆ కామెంట్స్‌ చేశారు. ఎందుకు అన్నారు అనే విషయం పక్కనపెడితే… ఆ విషయం సోషల్‌ మీడియాలో అయితే పెద్ద రచ్చే చేసింది. ఆ తర్వాత కూడా ఆయన్ను నెటిజన్లు ఆ విషయంలో వెంటాడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి అదే జరగడంతో ఆ దర్శకుడు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

‘హాయ్‌ నాన్న’ సినిమా చూశానని, బాగా నచ్చిందని దర్శకుడు వెంకటేశ్‌ మహా ట్వీట్‌ చేశారు. నాని కథలను ఎంపిక చేసుకునే తీరు బాగుందని చెపపిన ఆయన దర్శకుడు శౌర్యువ్‌ని అభినందించారు. అయితే ఆ పోస్టుపై ఓ నెటిజన్‌ స్పందించారు. ఇప్పుడు ఆ స్పందనే పెద్ద చర్చకు, రచ్చకు దారి తీసింది. ‘ఈయన తీసింది ఒక్క సినిమా. పైగా ‘కేజీయఫ్‌’ బాలేదు అని అంటారు. ఈయన హీరో అట.. కామెడీ ఫెలో’ అని కామెంట్‌ పెట్టాడు ఆ నెటిజన్‌.

మామూలుగా అయితే ఇలాంటి కామెంట్లను అందరూ పట్టించుకోరు. కానీ (Venkatesh Maha) వెంకటేశ్‌ రిప్లై ఇచ్చారు. ఎందుకు రిప్లై ఇవ్వాల్సి వచ్చిందో చెబుతూనే కౌంటర్‌ ఇచ్చారు. ఇలాగే వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెబుతున్నా వినండి అంటూ తన ఆలోచనను చెప్పుకొచ్చారు. ‘‘ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు… ఏ సినిమాలు తీశామన్నది ముఖ్యం. తెలుగులో నేను కొన్ని బెస్ట్‌ సినిమాలు తీశానని గర్వంగా చెప్పుకొంటా. భవిష్యత్తులోనూ తీస్తా’’ అని కౌంటర్‌ ఇచ్చారు.

అంతేకాదు ‘ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక ఊరుకోను’ అంటూ ఓ వార్నింగ్‌ కూడా ఇచ్చారాయన. ఇలా కామెంట్స్‌ చేసేవారిపై అవసరమైతే వ్యక్తిగతంగా, న్యాయపరంగా ఫైట్‌ చేస్తానని అన్నారు. ఈమేరకు తనకు మద్దతు ఇవ్వాలని అభిమానుల్ని, నెటిజన్లను వెంకటేశ్ మహా కోరారు.

‘‘తల్లి కలను నెరవేర్చడం కోసం ఓ కొడుకు బంగారాన్ని సంపాదించి, చివరికి సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం’’ అంటూ గతంలో వ్యాఖ్యలు చేశారు వెంకటేశ్‌ మహా. ఆయన సినిమా పేరు చెప్పలేదు కానీ… అది ‘కేజీయఫ్‌’ గురించే అని తెలిసిపోతుంది. దీంతో ఆయన మీద కామెంట్లు వస్తూనే ఉన్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus