వైజాగ్ లో వెంకీ!
- July 12, 2016 / 02:19 PM ISTByFilmy Focus
వెంకీ ప్రస్తుతం గెడ్డం, కండలు పెంచే పనిలో పడ్డాడు. హిందీలో సూపర్ హిట్ అయిన “సాలా కడూస్”ను తెలుగులో వెంకీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సుధా కొంగర తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించనుండగా.. హిందీలో లేడీ బాక్సర్ గా నటించిన రితికా సింగ్ తెలుగులోనూ తన పాత్రను తానే పోషిస్తోంది. సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
ఈ సినిమా బాక్సర్ ది స్వతహా చేపలు పట్టే కుటుంబం.. అందుకోసం ఈ సినిమా చిత్రీకరణను వైజాగ్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సముద్ర తీరంతోపాటు రామానాయుడు స్టూడియో కూడా ఉంది కాబట్టి షూటింగ్ తొందరగా పూర్తి చేయొచ్చు. ఈ డిసెంబర్ లోనే ఈ రీమేక్ ను విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















