ఖరారైన త్రివిక్రమ్, వెంకటేష్ మూవీ!

విక్టరీ వెంకటేష్ రేపు (డిసెంబర్ 13) పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వెంకటేష్ “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి”.. చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు అందించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని  హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్నారు.  ప్రస్తుతం ఇదే బ్యానర్లో పవన్ కళ్యాణ్ తో “అజ్ఞాతవాసి” సినిమాను చేస్తున్నారు. ఇది రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమాని మొదలు పెట్టనున్నారు.

ఆ చిత్రం కంప్లీట్ అయిన తర్వాతే వెంకీ మూవీ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం వెంకటేష్ కూడా బిజీగానే ఉన్నారు. గురు సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని మొదలెట్టారు. అనిల్ సుంకర, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది  ఈ సినిమాకి ఆట నాదే వేట నాదే అనే పేరు పరిశీలిస్తున్నారు. అరవై రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనే ప్లాన్ తో తేజ ఉన్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ మాటల మాంత్రికుడి డైరక్షన్లో నటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus