మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతును ప్రకటించగా బాలకృష్ణ మంచు విష్ణుకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. మురళీమోహన్ మా ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పినా ఆ పరిస్థితులు కనిపించడం లేదు. నారప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి స్పందించారు. ఏదీ మన చేతుల్లో ఉండదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చని వెంకటేష్ అన్నారు.
అందరికీ మంచే జరగాలని తాను కోరుకుంటున్నానని వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మాటల తూటాలు, విమర్శలు శాశ్వతం కాదని వెంకటేష్ తెలిపారు. మా ఎనికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలోవెంకటేష్ ఎవరికీ మద్దతును ప్రకటించకపోవడం గమనార్హం. మరోవైపు నారప్ప తన కెరీర్ లో డిఫరెంట్ ఫిలిం అవుతుందని వెంకీ భావిస్తున్నారు. నారప్ప సినిమా కోసం మేకప్ లేకుండా నటించానని వెంకటేష్ చెప్పుకొచ్చారు. సినిమాకు తగినట్లుగా బాడీ లాంగ్వేజ్ ను మార్చుకున్నానని వెంకటేష్ అన్నారు. ఓటీటీ అభివృద్ధి చెందడం కూడా మంచి పరిణామమే అని వెంకటేష్ తెలిపారు.
కరోనా వల్ల జనాల్లో చాలా మార్పు వచ్చిందని ఇప్పుడు జనాలకు లైఫ్ సీక్రెట్ తెలిసిపోయిందని వెంకటేష్ పేర్కొన్నారు. 100 సినిమాల మార్కుని దాటటం మన చేతుల్లో లేని పని అని వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఎఫ్3 మూవీ షూటింగ్ సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్