ఒక్కోసారి కొందరు హీరోలకు ఒకే రకమైన కథలు వస్తుంటాయి. లేదా ఒక హీరో చేయాలనుకున్న జోనర్ లో మరో హీరో సినిమా మొదలెట్టాడంటే.. వెంటనే ఈ హీరో తాను చేయాలనుకున్న సినిమాను ఆపేస్తాడు. ఇప్పుడు వెంకటేష్ పరిస్థితి అలానే తయారయ్యింది. తాను ముచ్చటపడి చేయాలనుకున్న బాలీవుడ్ హిట్ సినిమా “దే దే ప్యార్ దే”ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు వెంకటేష్ & సురేష్ బాబు. ఈమేరకు రీమేక్ రైట్స్ కొనేశారు కూడా. కానీ.. ఇంచుమించు అదే తరహా కథతో నాగార్జున “మన్మధుడు 2” తెలుగులో రూపొంది, విడుదలై, ఫ్లాప్ గా నిలవడంతో ఇప్పుడు అదే కథనంతో తెరకెక్కాల్సిన తన సినిమా చేయాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు వెంకీ మామ.
రెండు సినిమాల కథనాలు వేరైనా.. కథలు మాత్రమే ఒకటే. వయసు పైబడిన ఓ 50 ఏళ్ల వ్యక్తి, తన వయసులో సగం కూడా లేని అమ్మాయితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం పడే కష్టాల నేపధ్యంలో సినిమా సాగుతుంది. ఇప్పటికీ నవ మన్మఢుడిలా ఉండే నాగార్జున అలాంటి పాత్రలో నటిస్తేనే జనాలు ఈసడించుకొంటున్నారు. అలాంటిది కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఆ తరహా పాత్ర పోషిస్తే పరిస్థితి ఏమిటి అనే ఆలోచనతోనే ఆ రీమేక్ ను పక్కనపెట్టాడు వెంకీ.
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి