ప్రేక్షకుల అభిరుచి మారింది. కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చాయి. అందుకే సినిమాని సింపుల్ గా తీసి హిట్ కొట్టడం ఇప్పుడు కష్టమైన పని. అందుకే తెలుగు సినిమా దర్శకనిర్మాతలు సినిమా నిర్మాణానికి ఎక్కువ రోజులు కేటాయిస్తున్నారు. అయితే ప్రస్తుత ట్రెండ్ కి భిన్నంగా 60 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాడానికి డైరక్టర్ తేజ రెడీ అయ్యారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా ప్రారంభమైన ఈ చిత్రాన్ని 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అనిల్ సుంకర, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “ఆట నాదే వేట నాదే” అనే పేరు పరిశీలిస్తున్నారు. హీరోయిన్ గా అనుష్క నటించనున్నట్లు సమాచారం.
అయితే ఈ రెండు విషయాలపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గురు తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాలో రానా, నాగ చైతన్య లు గెస్ట్ రోల్ చేస్తారని టాక్. అలాగే డాక్టర్ రాజశేఖర్ ఓ కీలకరోల్ పోషిస్తారని ఫిలిం నగర వాసులు చెప్పుకుంటున్నారు. తేజ ఈ చిత్రాన్ని పూర్తి చేసి మే నుంచి బాలకృష్ణతో నందమూరి తారకరామారావు బయో పిక్ ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.