F2 లో మిల్కీ బ్యూటీ నటించనుందా ?

గురు సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తేజ దర్శకత్వంలో ‘ఆట నాదే వేట నాదే’ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత వీరిద్దరూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి వైజాక్ లో ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రీసెంట్ గా హైదరాబాద్ కి వచ్చారు. ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) పేరు ఫిక్స్ చేసిన ఈ చిత్రానికి ఆర్టిస్టుల సెలక్షన్ మొదలెట్టారు. ఇందులో ఒక హీరోయిన్ గా తమన్నాని సెలక్ట్ చేసినట్లు సమాచారం.

ఈమె వెంకీకి జోడీగా కనిపించనున్నట్లు తెలిసింది. వరుణ్ తేజ్ కి జోడీ కోసం వెతుకుతున్నారు. ఎంటర్టైన్మెంట్ అందించడంలో మంచి పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాలో కూడ బోలెడంత వినోదాన్ని ఉండేలా చూస్తున్నారని సమాచారం. పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండవని డైరెక్టర్ ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అందుకే ఈ సినిమాకి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus