ఖరారు అయిన వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ

గురు సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తేజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత చిత్రం కూడా ఒకే అయినట్లు తెలిసింది. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తో మల్టీ స్టారర్ సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం. మహేష్, పవన్ కళ్యాణ్, రామ్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్ ఈ సారి వరుణ్ తేజ్ తో కలిసి నటించబోతున్నారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న తొలిప్రేమ ఫిబ్రవరిలో థియేటర్లోకి రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే సంకల్ప్ రెడ్డి తో కలిసి నడవనున్నారు. దీని తర్వాత మల్టీస్టారర్ మూవీ మొదలు పెట్టనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి F2 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. (ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ) అనేది ట్యాగ్ లైన్. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus