నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ(Nandamuri Mokshagnya).. డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ‘హనుమాన్’ (Hanuman) లానే ఇది కూడా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'(పీవీసీయు) లో భాగమే..! ఈపాటికే షూటింగ్ మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల డిలే అవుతుంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనే ప్రచారం కూడా నడిచింది. ‘దర్శకుడు ప్రశాంత్ వర్మ వ్యవహారశైలి మోక్షజ్ఞకి నచ్చడం లేదని, అందువల్ల షూటింగ్ మొదలయ్యే ముందు రోజు నైట్ ఫోన్ చేసి..
నేను ఈ ప్రాజెక్టులో నటించలేను’ అని ప్రశాంత్ వర్మతో చెప్పినట్టు టాక్ నడిచింది. ఇది ఒక వెర్షన్. మరొక వెర్షన్ కూడా ఉంది. ప్రశాంత్ వర్మ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయకపోవడం వల్ల.. బాలకృష్ణకి కోపం వచ్చి ప్రాజెక్టు ఆపేశారని కొంతమంది చెప్పుకొచ్చారు. ఇది రెండో వెర్షన్. అయితే తమ ప్రాజెక్టు గురించి లేని పోనీ గాసిప్పులు ప్రచారం చేయొద్దంటూ నిర్మాతలు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా విన్నపించుకోవడం కూడా జరిగింది.
ఆ డెబ్యూ సంగతి ఎలా ఉన్నా.. మోక్షజ్ఞ తేజ రెండో సినిమాకి కూడా దర్శకుడు ఫిక్స్ అయిపోయాడు అనేది తాజా సమాచారం. అతను మరెవరో కాదు వెంకీ అట్లూరి (Venky Atluri) (Venky Atluri) . ‘సార్’(Sir), ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) వంటి సూపర్ హిట్లతో వెంకీ మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య.. ‘సితార..’ బ్యానర్లో ‘డాకు మహారాజ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ టైంలో మోక్షజ్ఞ ప్రస్తావన నాగవంశీ వద్ద బాలకృష్ణ ప్రస్తావించగా.
అతను వెంకీ అట్లూరి వద్ద మంచి కథ ఉందని చెప్పడం.. తర్వాత వెంకీ ప్రత్యేకంగా బాలయ్యని మీట్ అయ్యి.. కథ వినిపించడం జరిగిందట. అది బాలయ్యకి నచ్చిందట. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని బాలయ్య.. వెంకీతో చెప్పారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘సితార..’ లోనే ఈ ప్రాజెక్టు ఉండొచ్చు. అయితే ముందు.. మోక్షజ్ఞ తన డెబ్యూ ఫినిష్ చేసుకోవాలి మరోపక్క వెంకీ అట్లూరి సూర్యతో సెట్ చేసుకున్న సినిమా కూడా కంప్లీట్ చేయాలి.