నితిన్ సినిమాపై వస్తున్న వార్తలపై స్పందించిన డైరక్టర్

యువ హీరో నితిన్ కి ప్రస్తుతం హిట్ తప్పనిసరి. అతని గత చిత్రాలు లై, చల్ మోహన్ రంగ రెండూ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈసారి శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో “శ్రీనివాస కళ్యాణం” అనే చిత్రాన్ని చేస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత నితిన్ “ఛలో” ఫేమ్ వెంకీ కుడుములతో ఒక సినిమా చేయనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా పేరు ఫిక్స్ అయిందని, “భీష్మ” అనే పేరుని ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు సినిమా లోగో ఇదేనని లోగో పోస్టర్ ఒకటి వైరల్ అవుతోంది. ఇది చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.

దీంతో డైరక్టర్ వెంకీ కుడుముల స్పందించక తప్పలేదు. “ప్రచారంలో ఉన్నది అసలైన లోగో కాదు. ఫేక్ వార్తల్ని నమ్మొద్దు. బెస్ట్ వర్క్ కావాలంటే కొంత సమయం పడుతుంది. త్వరలోనే అన్ని వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తాను” అని ట్విట్టర్ వేదికపై స్పష్టం చేశారు. దీంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఇక శ్రీనివాస కళ్యాణం విషయానికి వస్తే ఇది దిల్‌ కాంబినేషన్లో వస్తోంది. దిల్ మూవీ ఇటు హీరోగా నితిన్ కి, అటు నిర్మాతగా దిల్ రాజుకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా విషయంలోనూ మళ్ళీ అదే రిపీట్ అవుతుందని నితిన్ భావిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 10 న థియేటర్లోకి తీసుకురావడానికి నిర్మాత ప్లాన్ వేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus