విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. డిసెంబర్ 13న.. వెంకటేష్ పుట్టినరోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని.. రెండవ వారంలోకి అడుగుపెట్టినప్పటికీ.. డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్… నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
ఇక ఈ చిత్రం 11 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
10.24 cr
సీడెడ్
4.25 cr
ఉత్తరాంధ్ర
4.05 cr
ఈస్ట్
2.05 cr
వెస్ట్
1.27 cr
కృష్ణా
1.56 cr
గుంటూరు
2.04 cr
నెల్లూరు
0.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.54 cr
ఓవర్సీస్
3.08 cr
వరల్డ్ వైడ్ టోటల్
31.98 cr (share)
‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 31.98 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 1.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా మరో 4 సినిమాలు విడుదలైనప్పటి ‘వెంకీమామ’ జోరు అస్సలు ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి. రెండో సోమవారం నాడు కూడా ఈ చిత్రం 0.54 కోట్ల షేర్ ను రాబట్టింది.