వైరల్ అవుతున్న ‘వెంకీమామ’ స్టోరీ..!

నిజ జీవితంలో మామా అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్.రవీంధ్ర (బాబీ) డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం రెండు టీజర్లు మరియు పాటలకి మంచి స్పందన లభించింది.దీంతో ఈ చిత్రం పై క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.

ఇక ఈ చిత్రం కథ ఇదేనంటూ రక రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘విలేజ్ లో మావయ్య లవ్ కి అల్లుడు హెల్ప్ చేస్తాడు.. అలాగే అల్లుడి లవ్ కు మావయ్య హెల్ప్ చేస్తాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నీ తానై తన మేనల్లుడిని పెంచుతాడు ‘వెంకీమామ’. అయితే తన జాతకంలో దోషం ఉందని… తన వల్ల… మావయ్యకు కూడా ప్రాణ గండం ఉందని తెలిసిన అల్లుడు.. దూరంగా వెళ్ళిపోతాడు. ఇక అల్లుడిని వెతుక్కుంటూ తిరుగుతుంటాడు ‘వెంకీమామ’. కట్ చేస్తే అల్లుడు మిలిటరీలో కెప్టెన్ కార్తిక్ గా జీవిస్తుంటాడు. వెంకటేష్ ఓల్డ్ గెటప్ లో ఉన్నప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందని అలా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం జరుగుతుందని టాక్. చివరికి ఈ మామా అల్లుళ్ళు కలిశారా లేక మావయ్య చనిపోయాడా? అనేది మిగిలిన కథాంశం అని తెలుస్తుంది. ఈ కథలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే.. డిసెంబర్ 13 వరకూ వేచి చూడాల్సిందే..!

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus