Srinu Vaitla: రీ రిలీజ్ లో అదరగొడుతున్న ‘వెంకీ’ .. శ్రీను వైట్లకి కలిసొస్తుందా?

  • January 2, 2024 / 10:09 PM IST

శ్రీను వైట్ల ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగాడు. ‘నీకోసం’ వంటి సీరియస్ మూవీని తెరకెక్కించినప్పటికీ ‘ఆనందం’ సినిమా నుండి తనలోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టి తన సినిమాల మార్కెట్ రేంజ్ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ‘వెంకీ’ ‘ఢీ’ ‘దుబాయ్ శీను’ ‘రెడీ’ ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘కింగ్’ ‘అందరివాడు’ ‘నమో వెంకటేశ’ వంటి చిత్రాలకి నెగిటివ్ టాక్ వచ్చినా..

అవి బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలనే అందుకున్నాయి. కానీ ‘ఆగడు’ నుండి శ్రీను వైట్లకి డిజాస్టర్లు ఎదురయ్యాయి. అతని బ్యాడ్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ తర్వాత ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలు తీశాడు. 5 ఏళ్ళ నుండి శ్రీను వైట్ల ఖాళీగానే ఉన్నాడు. అతని డైరెక్షన్లో సినిమా చేయడానికి ఏ హీరో ఇంట్రెస్ట్ చూపించలేదు. మంచు విష్ణుతో ఓ సినిమా అనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు.

ఓ దశలో చిరంజీవితో సినిమా ఫిక్స్ అయినట్లు కనిపించినా.. చిరు కూడా కంటిన్యూగా హిట్లు ఇవ్వకపోవడంతో (Srinu Vaitla) శ్రీను వైట్లకి ఛాన్స్ ఇవ్వలేకపోయారు. అయితే గోపీచంద్ తో సైలెంట్ గా ఓ సినిమా సెట్ చేసుకున్నాడు శ్రీను వైట్ల. అయినా జనాలకి అతని పై నమ్మకం లేదు. ఈ క్రమంలో అనుకోకుండా ‘వెంకీ’ సినిమా రీ రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 30 న ఈ సినిమా రీ రిలీజ్ అవ్వగా..

బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నే సాధించింది. రీ రిలీజ్ అయిన మూడు రోజుల్లో ‘వెంకీ’ సినిమా రూ.2 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. అందుకే శ్రీనువైట్ల తన ట్విట్టర్లో ‘వెంకీ’ రీ రిలీజ్ కి సంబంధించిన ట్వీట్లు వేస్తూ .. ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus