‘మహర్షి’ ప్రీ రిలీజ్ కు గెస్టులుగా వెంకీమామ, ఆర్.ఆర్.ఆర్ హీరోలు..?

మహేష్ బాబు 25 వ చిత్రమైన ‘మహర్షి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. వంశీ పైడిపల్లి రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ విడుదల చేసారు. విడుదలకి మరో రెండు వారలు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్లు వేగవంతం చేసింది చిత్ర యూనిట్. సోషల్ మీడియాలో సమయం దొరికినప్పుడల్లా ఈ చిత్రానికి సంబందించిన రక రకాల లుక్స్ ను విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక మే 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించనున్నారు.

హైదరాబాద్ లోనే నెక్లెస్ రోడ్ సమీపంలోని ‘పీపుల్స్ ప్లాజా’ లో సాయంత్రం 6 నుండీ ఈ వేడుక జరగనుంది. మహేష్ 25 వ చిత్రం కాబట్టి.. ఆయనతో ఇప్పటి వరకూ పనిచేసిన డైరెక్టర్లను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. అంతే కాదు ఈ వేడుకకి ముఖ్య అతిధులుగా మహేష్ స్నేహితులైన ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలు… ఎన్టీఆర్, చరణ్ లు హాజరు కాబోతున్నారట. మహేష్ తో పాటూ ఈ చిత్ర డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు మంచి స్నేహితుడన్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పూర్తయ్యాక చరణ్ మరోసారి వంశీ పైడిపల్లి డైరెక్షన్లో పని చేయబోతున్నాడట. ఇందుకే వీరిద్దరూ ముఖ్య అతిధులుగా హాజరుకాబోతున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటూ విక్టరీ వెంకటేష్ కూడా ముఖ్యఅతిధిగా హాజరయ్యే అవకాశం ఉందట.’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘ఎఫ్2’ చిత్రాలతో అటు మహేష్, ఇటు దిల్ రాజు లతో వెంకటేష్ కు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ కారణంగానే వెంకీ కూడా హాజరుకాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతుందో అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus