చైతుకు మేనమామగా వెంకీ!

  • March 19, 2016 / 12:26 PM IST

నాగ చైతన్యకు నిజ జీవితంలో వెంకటేష్ మావయ్య అవుతాడన్న సంగతి తెలిసిందే. అయితే తెరపై కూడా వెంకీ, చైతుకి మేనమామ గా నటిస్తున్నాడట. నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘ప్రేమమ్’ సినిమాలో నటిస్తున్నాడు. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో చైతు చదివే కాలేజ్ ప్రిన్సిపాల్ అతని ప్రవర్తన సరిగ్గా లేదని అతని మావయ్యను పిలిపించి మాట్లాడతాడు. దాంతో కాలేజ్ కు వెళ్ళిన వెంకీ, కుర్రాళ్ళు అంటే అల్లరి చేయరా..? అని రివర్స్ లో ప్రిన్సిపాల్ కే క్లాస్ తీసుకుంటాడు. ఇలా మేనల్లుడిని సపోర్ట్ చేసే మేనమామ పాత్రలో వెంకీ తన నటనతో ఇరగదీసాడట. రీసెంట్ గా ఈ సీన్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ముఖ్యంగా వెంకీ నటించే సీన్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని  భావిస్తున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus