మెయిన్ లీడ్ గా వెన్నెల కిషోర్.. హిట్ అందుకుంటాడా..?

  • January 5, 2021 / 10:58 PM IST

టాలీవుడ్ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది నటులు హీరోలుగా మారి సినిమాలు చేశారు. కానీ ఎవరూ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. దీంతో తిరిగి కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ లిస్ట్ చాలా మంది కమెడియన్ల పేర్లు విన్నాం. కాగా.. తాజాగా మరో కమెడియన్ కూడా మెయిన్ లీడ్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. ‘వెన్నెల’ సినిమాలో తన కామెడీతో మెప్పించి ఆ సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు వెన్నెల కిషోర్.

ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉన్నాడు. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో వెన్నెల కిషోర్ కనిపిస్తున్నాడు. వరుస టాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిన వెన్నెల కిషోర్ ని ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కోసం సంప్రదిస్తాన్నారని తెలుస్తోంది. మెయిన్ లీడ్ కావడంతో అతడు కూడా నటించడానికి సిద్ధమవుతున్నారట. దర్శకుడు వేణు ఊడుగుల ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అంతేకాదు..

ఈ సిరీస్ కి తను కేవలం నిర్మాతగానే ఉంటానని, డైరెక్ట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ సిరీస్ ను అల్లు అరవింద్ కి చెందిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ తో వెన్నెల కిషోర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి!

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus