Venu Swamy: రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై వేణు స్వామి కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి ఊహించని విధంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో వరుస హిట్ సినిమాలతో అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు సంపాదించుకున్నారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న

రష్మిక ఏకంగా బాలీవుడ్ అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఈమె ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా నటి రష్మిక గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి రష్మిక గురించి మాట్లాడుతూ.. త్వరలోనే రష్మిక రాజకీయాలలోకి రాబోతుందని ఈయన పేర్కొన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఈమె ఎంపీగా పోటీ చేయబోతుందని ఈ సందర్భంగా వేణు స్వామి వెల్లడించారు.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న

ఈమె ఇలా రాజకీయాలలోకి వచ్చి ఎంపీగా పోటీ చేయబోతున్నారని వేణు స్వామి చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే వేణు స్వామి చెప్పినట్టు ఈమె సినీ ఇండస్ట్రీని వదిలి రాజకీయాలలోకి వస్తారా… లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus