అదిరే వేదికపై బాహుబలి 2 ఆడియో వేడుక
- March 3, 2017 / 08:09 AM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ చిత్రాన్ని కంప్లీట్ చేసిన రాజమౌళి .. ప్రస్తుతం ప్రచారంపై దృష్టి పెట్టారు. ప్రభాస్ పుట్టినరోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దర్శకధీరుడు, మహా శివరాత్రి నుంచి పబ్లిసిటీలోకి దిగారు. సినిమా రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి 1 ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వహించారు. బాహుబలి 2 కి కూడా అక్కడే నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. కానీ జక్కన్న వేదికను మార్చారు.
మహిష్మతి రాజ్యంలోనే వేడుకను జరిపేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మహిష్మతి రాజ్యం సెట్ వేశారు. ఆ రాజ్యం ఇప్పుడు ఆడియో వేడుకకు వేదిక కానుంది. ఏప్రిల్ 28న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో.. దానికి ఓ నెల రోజుల ముందు అంటే మార్చి 28న ఆడియో వేడుకను భారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ వివరాలను త్వరలో అధికారికంగా చిత్ర బృందం ప్రకటించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















