వాస్తవానికైతే నిన్న అంటే జనవరి 6 న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో `గుంటూరు కారం` ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. అందులో భాగంగానే ట్రైలర్ ని కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఈవెంట్ కి ప్రభుత్వం నుండి పర్మిషన్ రాకపోవడంతో క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కొత్త డేట్ ను అనౌన్స్ చేస్తామని కూడా చిత్ర బృందం వెల్లడించి అభిమానులకి క్షమాపణలు చెప్పింది. ట్రైలర్ ని అయితే ఈరోజు అనగా జనవరి 7 న రిలీజ్ చేస్తున్నారు.
కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతి ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. గుంటూరులో ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అని చిత్ర బృందం ఆలోచించి అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించింది. వెంటనే పర్మిషన్ దొరికేయడంతో జనవరి 9న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం రెడీ అయినట్లు తాజా సమాచారం.
దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీత దర్శకుడు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!