భాష. బడ్జెట్ లతో సంబంధం లేకుండా.. పాత్ర ఏదైనా సరే, దానికి ప్రాణ ప్రతిష్ట చేసే అతి తక్కువ నటుల్లో నాజర్ ఒకరు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో నటించిన ఈ జాతీయ స్థాయి నటుడికి ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు, మన్ననలు లభించాయి. తాజాగా ఈయనకు గౌరవ డాక్టరేట్ ను అందించింది వేల్ యూనివర్సిటీ.
ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్ష పద్వరిలో కొనసాగుతున్న నాజర్.. తనకు డాక్టరేట్ లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1985 లో కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘కళ్యాణ ఆగధిగల్’ చిత్రం తో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన నాజర్.. దక్షిణాది భాషలతో పాటు పలు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కిన దాదాపు 400 చిత్రాల్లో ఆయన నటించాడు.
ఈ అవార్డుతో నా బాధ్యత ఇంకా పెరిగింది. ఈ అవార్డును నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నాన’ని నాజర్ తెలిపారు!