సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు,వెట్రిమారన్ అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించడం జరిగింది. కొందరు అనారోగ్య సమస్యలతో, ఇంకొందరు వయసు సంబంధిత సమస్యలతో మరణించారు. మరికొంతమంది అయితే గుండెపోటుతో మరణించారు. మొన్నటికి మొన్న కన్నడ నటుడు నితిన్ గోపి కూడా గుండె పోటుతో మరణించడం జరిగింది. ఇక తాజాగా మరో విషాదకరమైన న్యూస్ బయటకు వచ్చింది. దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శరన్ రాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘శుక్రవారం రాత్రి 11.30 గంటల టైంలో తన బైకుపై కేకే నగర్‌లోని రోడ్డుపై వెళుతూ ఉన్నారు.శరణ్‌ రాజ్‌ వెళుతున్న బైకును కార్ ఢీకొట్టింది.ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాడీని పోస్టుమార్టం కోసం పంపినట్టు తెలుస్తుంది. ముందుగా వారు కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడినట్టు తెలుస్తుంది.

చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్న పళనప్పన్‌ అనే వ్యక్తి కారణంగానే శరన్ కి ఈ యాక్సిడెంట్‌ అయినట్టు పోలీసుల విచారణలో తేలింది. పళనప్పన్‌ మద్యం సేవించి కారు నడిపినందున , ఆ మత్తులో శరణ్‌ బైకును అతను ఢీకొట్టాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకీ తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక శరణ్‌ రాజ్‌ 6 ఏళ్ళ నుండి వెట్రిమారన్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అతనికి నటన పై ఆసక్తి ఉండడంతో వెట్రిమారన్‌ తన సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా ఇచ్చారు.

అసురన్‌, వడాచెన్నై వంటి క్రేజీ సినిమాల్లో ఇతను నటించడం జరిగింది. అలా సినిమాల్లో నటిస్తూనే మరోపక్క వెట్రిమారన్‌ వద్ద అసిస్టెంట్‌గా కూడా పనిచేసేవాడు శరన్ రాజ్. ఇక ఇతని మృతితో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చాలా మంది స్టార్లు ఇతని మృతికి చింతిస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వెట్రిమారన్.. (Director) శరన్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus