‘ఎఫ్3’.. 2021 సంక్రాంతికి లేనట్టేనా..?

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ కథని రెడీ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో కూడా వెంకటేష్, వరుణ్ లే హీరోలుగా నటించబోతున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అనిల్.. తన సొంత ఊరిలోనే ఉన్నాడట. అయితే ఈ యంగ్ డైరెక్టర్ కు.. మన వెంకటేష్ పెద్ద షాక్ ఇచ్చాడని తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. జూలై నుండీ ‘ఎఫ్3’ షూటింగ్ ను మొదలుపెట్టి.. 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలి అని అనిల్ ప్లాన్ చేసుకున్నాడు.

అయితే లాక్ డౌన్ వల్ల వెంకటేష్ సినిమా ‘నారప్ప’ షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తుందో తెలీదు. ఒకవేళ ఇదే నెలలో షూటింగ్ లకు పెర్మిషన్లు ఇచ్చినా.. వెంకీ ‘నారప్ప’ షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి మరో 3 నెలలు టైం పడుతుందట. అంతేకాదు.. అక్టోబర్ నుండీ రానా పెళ్ళి హడావిడి కూడా మొదలవుతుంది. డిసెంబర్ లోనే రానా పెళ్ళి ఉంటుందని దాదాపు కన్ఫార్మ్ అయిపొయింది. కాబట్టి ‘ఎఫ్3’ సీక్వెల్ ఈ ఏడాది మొదలు పెట్టే అవకాశాలు లేవని.. అనిల్ రావిపూడితో వెంకటేష్ ఫోన్ చేసి చెప్పాడని సమాచారం.

దాంతో అనిల్ రావిపూడి డైలమా లో పడ్డాడని తెలుస్తుంది. ఇప్పుడు మరో సినిమా చేద్దామంటే.. ఏ హీరో కూడా ఖాళీగా లేడు. బన్నీ ‘పుష్ప’ చేస్తున్నాడు. మహేష్ ‘సర్కారు వారి పాట’ కు కమిట్ అయ్యాడు. రాంచరణ్, ఎన్టీఆర్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ తో బిజీ బిజీ. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చేసాడు. కనీసం విజయ్ దేవరకొండ, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగ చైతన్య,అఖిల్,సాయి తేజ్.. వంటి హీరోలు సైతం ఎవ్వరూ ఖాళీగా లేరు. కాబట్టి అనిల్ రావిపూడి 2021 వరకూ ఖాళీగా ఉండాల్సిందేనేమో..!

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus