సిల్క్ స్మిత జీవిత ఆధారంగా ‘డర్టీ పిక్చర్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఓ చిన్న టౌన్ నుండీ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయికి … ‘నీ మోహం అద్దంలో చూసుకున్నావా… నీకు సినిమా అవకాశాలు ఇస్తారా.. సైడ్ క్యారెక్టర్ లకు కూడా పనికి రావు’ అని విమర్శించారు. దాంతో వ్యాంప్ పాత్రలు చేసి హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ను సంపాదించుకుంది సిల్క్ స్మిత. సినిమా మొత్తం కనిపించే హీరోయిన్ కు ఎంత పారితోషికం ఇచ్చే వారో..,
సినిమాలో 20 నిమిషాల పాటు కనిపించే సిల్క్ స్మిత పాత్రకు కూడా అదే స్థాయిలో ఇచ్చేవారట. అయితే ఆమె సినీ రంగంలో ఎదగడం కోసం ఏమాత్రం వెనకాడేది కాదు. ఇక ఈమె బయోపిక్ లో నటించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. చాలా మంది ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసారట. అయితే విద్యాబాలన్ ఈ పాత్రకు ఒప్పుకుంది. ఇందుకు చాలా మంది ఈమెను తిట్టారట. ‘శకుంతల దేవి’ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.
‘పక్కింటి అమ్మాయి తరహా ఇమేజ్ ఉన్న నువ్వు ఇలాంటి పాత్ర చెయ్యడమేంటి’ అంటూ నన్ను తిట్టారు అని కూడా విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. అయితే ఈమె తల్లి దండ్రులు మాత్రం ఈమెకు అడ్డు చెప్పలేదట. ‘నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి’ అంటూ ఈమెకు చెప్పారని కూడా తెలిపింది.