హీరోయిన్ డిన్నర్ కి రాలేదని షూటింగ్ ఆపేసిన మంత్రి!

మధ్యప్రదేశ్ అటవీ శాఖా మంత్రి విజయ్ షాకి సంబంధించిన వార్త ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ రాష్ట్రంలో ఓ సినిమా షూటింగ్ కోసం పర్మిషన్ ఆడితే.. దానికి గాను ఆ సినిమాలో హీరోయిన్ ని డిన్నర్ కి రమ్మని పిలిచారట విజయ్ షా. హీరోయిన్ ఆయన ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేసిందని షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారట. ప్రస్తుతం ఈ వార్త అటు రాజకీయవర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇంతకీ సదరు మినిష్టర్ పిలిచిన హీరోయిన్ ఎవరంటే.. విద్యాబాలన్.

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘షేర్నీ’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమా మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. కథ ప్రకారం కొంతభాగం మధ్యప్రదేశ్ అడవుల్లో చిత్రీకరించాల్సివుంది. దీంతో యూనిట్ పర్మిషన్ కోసం మంత్రి గారికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మంత్రి విజయ్ షా.. నటి విద్యాబాలన్ ని తనతో డిన్నర్ కి రావాలని కోరారట. దానికి ఆమె అంగీకరించకపోవడంతో.. షూటింగ్ పర్మిషన్ కోసం పెట్టుకున్న రిక్వెస్ట్ ని నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఈ వార్త వైరల్ అయ్యేసరికి మంత్రి గారు నేరుగా స్పందించారు. తను ఎవరినీ డిన్నర్ కి పిలవలేదని అన్నారు. తననే సినిమా యూనిట్ విందుకి పిలిచిందని.. కానీ తనకు కుదరక మహారాష్ట్ర వచ్చినప్పుడు కలుస్తానని చెప్పడంతో విందు క్యాన్సిల్ చేసుకున్నారని.. షూటింగ్ కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ విషయంలో చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus