భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీ లేదా వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా నటి విద్యాబాలన్ నటించనుంది. ‘ఇందిర: ఇండియాస్ పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో ప్రముఖ రచయిత సాగరికా ఘోష్ రాసిన నవలను వెబ్‌సిరీస్‌గా గానీ, సినిమాగా గానీ తెరకెక్కించనున్నారు. అయితే ఏ రూపంలో రాబోతుందనే విషయం మీద ఇంకా స్పష్టత లేదు. తన పుస్తకం హక్కులను రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసినట్లు సాగరికా ఘోష్ సోషల్ మీడియాలో తెలిపారు. అలాగే విద్యాబాలన్ కూడా తాను ఇందిర పాత్రలో నటించబోతుండటం చాలా సంతోషంగా ఉందని ప్రకటించింది.
“పరిణీతి” లాంటి అద్భుతమైన చిత్రంలో తన నటచాతుర్యంతో ఆకట్టుకొన్నప్పటికీ.. “డర్టీ పిక్చర్”లో ఆరబోసిన అందాలు, పండించిన శృంగార రసం వల్లే ఆడియన్స్ కి ఎక్కువగా గుర్తుండిపోయింది విద్యాబాలన్. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను వివాహమాడి సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చి.. ప్రస్తుతం సెలెక్టడ్ గా సినిమాలు చేసుకొంటూ వస్తున్న విద్యాబాలన్ త్వరలో నిర్మాతగానూ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.