Vignesh, Nayanthara: భార్యకు కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చిన విగ్నేష్!

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార నాలుగు పదుల వయసుకి చేరువ అవుతున్నప్పటికీ అదే ఉత్సాహం అదే అందంతో ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈమె గత ఏడాది డైరెక్టర్ విగ్నేష్ ను వివాహం చేసుకొని సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.. పెళ్లి తర్వాత కూడా నయనతార వరుస సినిమాలలో బిజీ అయ్యారు.

ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. జవాన్ సినిమా ద్వారా సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార ఇటీవల తన 39వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే తన పుట్టిన రోజు సందర్భంగా తన భర్త తనకు కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా ఇచ్చారని చాలా ఆలస్యంగా ఈమె తెలియజేశారు.

అయితే తన భర్త తనకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అనేది మాత్రం ఈమె పూర్తిగా తెలియ చేయకపోయినా ఆ లోగో ద్వారా తన భర్త తనకు ఖరీదైన కారును కానుకగా ఇచ్చారని స్పష్టంగా అర్థం అవుతుంది. నయన్ కోసం లగ్జరీ మెర్సిడీజ్ మేబ్యాచ్ ఎస్ క్లాస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారని దీని విలువ సుమారు 2.7 కోట్ల రూపాయల విలువ ఉంటుంది అంటూ నెటిజన్స్ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి (Nayanthara) ఈమె వెల్కమ్ టు అవర్ హోమ్ బ్యూటీ అంటూ తనకు ఇలాంటి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చినందుకు తన భర్తకు థాంక్స్ చెబుతూ నోట్ రాశారు. అయితే పుట్టినరోజు సందర్భంగా ఈయన ఈ కారుని ఇప్పుడు ఇచ్చారని తెలుస్తుంది. ముందుగానే బుక్ చేసిన డెలివరీ లేట్ అవ్వడం వల్ల ఈ కారు ఇప్పుడు వారి ఇంటికి చేరుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus