దక్షిణాది లవ్ కపుల్ నయనతార-విఘ్నేష్ శివన్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనేది అభిమానుల ప్రశ్న. రీసెంట్ గా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు రాగా.. వాటిని విఘ్నేష్ కొట్టిపారేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని.. కెరీర్ పరంగా ఇద్దరం చాలా బిజీగా ఉన్నామని చెప్పాడు. అంతేకాదు.. తామిద్దరికీ డేటింగ్ లైఫ్ మీద బోర్ కొట్టినప్పుడే పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చాడు.
అయితే తాజాగా మరోసారి విఘ్నేష్ తన పెళ్లి గురించి స్పందించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించిన విఘ్నేష్.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ నయన్-విఘ్నేష్ ల పెళ్లి గురించి అడిగాడు. ”మీరు.. నయన్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు..? మీ పెళ్లి కోసం చాలా ఎదురుచూస్తున్నాం” అని ఓ యూజర్ అడగగా.. దానికి విఘ్నేష్.. ‘పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని..
ఆ శుభకార్యానికి డబ్బు ఆదా చేస్తున్నానని’ బదులిచ్చాడు. అలానే కరోనా త్వరగా వెళ్లిపోతే పెళ్లి చేసుకోవడానికి కుదురుతుందని పరోక్షంగా చెప్పాడు. దీంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెప్పాడు విఘ్నేష్.