Vaarasudu: విజయ్ 66వ సినిమా ‘వారసుడు’ మెయిన్ కథ అదేనట.. !

  • June 22, 2022 / 10:47 AM IST

రేపు అంటే జూన్ 22న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. కాబట్టి అతను తెలుగులో నటిస్తున్న స్ట్రైట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, ‘పీవీపీ’ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని … అందుకే ‘వారసుడు’ అనే టైటిల్‌ ఈ కథకి కరెక్ట్ గా సరిపోతుంది అని చిత్ర బృందం వెల్లడించింది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సూటు బూటు వేసుకుని స్టైల్ గా కనిపిస్తున్నాడు.’ ది బాస్ రిటర్న్స్’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. అంతా బాగానే ఉంది కానీ టైటిల్ ను బట్టి… క్యాప్షన్ ను బట్టి… చిత్ర బృందం వెల్లడించిన దానిని బట్టి..

ఈ చిత్రంలో రెండు సూపర్ హిట్ సినిమాల పోలికలు ఉంటాయని స్పష్టమవుతుంది. ఈ చిత్రం కథ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘బృందావనం’, అలాగే రజినీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘అరుణాచలం’ పోలికలు కనిపిస్తాయట. విజయ్ ఓ ఇంటికి కొన్ని కారణాలు వలన ఆతిథిగా వెళ్లడం…

అక్కడ చుట్టూ ఉన్న జనాలను, పరిసరాలను చక్కదిద్ది అసలైన వారసుడు అని తెలుసుకుని అక్కడే సెటిల్ అయిపోవడం. ఇలా ఉంటుంది కథ అని తెలుస్తుంది. దిల్ రాజు రెగ్యులర్ సినిమా ఫార్మేట్ లానే ఈ మూవీ కూడా ఉంటుంది అని వినికిడి. మరి అది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus