Vijay, Mahesh Babu: విజయ్ మరో మహర్షి కాబోతున్నారా?

స్టార్ హీరో విజయ్, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే మహేష్ రిజెక్ట్ చేసిన కథకు విజయ్ ఓకే చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

అయితే వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చినా మహేష్ రిజెక్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఉంది. మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు, మహర్షి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. వంశీ పైడిపల్లి చెప్పిన కథకు ఆ సినిమాలతో పోలికలు ఉండటంతో మహేష్ సున్నితంగా ఆ సినిమాలో నటించలేనని చెప్పినట్టు సమాచారం. అయితే దిల్ రాజుకు కథ నచ్చడంతో విజయ్ ను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారని తెలుస్తోంది.

కోలీవుడ్ హీరో విజయ్ మరో మహర్షి కాబోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉండగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి కానుంది. విజయ్ వంశీ చెప్పిన కథలో ఎలాంటి మార్పులు కోరలేదని సమాచారం. విజయ్ ఇప్పటివరకు ఇలాంటి కథల్లో నటించలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోలీవుడ్ హీరో విజయ్ కు తెలుగులో మార్కెట్ పెరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus