Vijay, Atlee: విజయ్‌ నెక్స్ట్‌ సినిమా ఆ డైరక్టర్‌తోనేనా?

  • October 21, 2022 / 02:04 PM IST

తమిళనాట మరో హ్యాట్రిక్‌కి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘తెరి’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టిన విజయ్‌ – అట్లీ మరో హ్యాట్రిక్‌ కోసం రెడీ అవుతున్నారని టాక్‌ వినిపిస్తోంది. విజయ్‌ 68వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు కోడంబాక్కం న్యూస్‌. గతంలో మాదిరిగానే తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తాం అని చెబుతున్నారు. విజయ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా తర్వాత ఇది ఉంటుందని టాక్‌.

ప్రస్తుత విజయ్‌ ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి సీజన్‌కు ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ఉంటుంది. లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. ఈ సినిమా తర్వాత వెంటనే ఫుల్‌ మాస్‌ మసాలా కమర్షియల్‌ సినిమా చేద్దాం అనుకున్నారట. ఇందులో భాగంగానే అట్లీ సినిమా చేద్దాం అనుకుంటున్నారట.

అట్లీ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ.. మాస్‌ మసాలా కమర్షియల్‌ చిత్రాలే. పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా ‘తెరి’లో కనిపిస్తే.. ‘మెర్సల్‌’లో ట్రిపుల్‌ రోల్‌ చేసి అదరగొట్టాడు విజయ్‌. ఇక ‘బిగిల్‌’లో అయితే రెండు పాత్రలు చేసి మెప్పించాడు. ఒక్కో సినిమా నేపథ్యం ఒక్కోలా ఉంటుంది. అయితే మూడింటిలో పగ, ప్రతీకారం నేపథ్యంగా ఉంటాయి. మరిప్పుడు నాలుగో సినిమా విషయంలో ఎలాంటి కథ ఎంచుకుంటారు అనేది చూడాలి.

మరోవైపు అట్లీ సినిమాల్లో తెలుగు సినిమాల రిఫరెన్స్‌ ఎక్కువగానే ఉంటుంది. గత సినిమాలు అన్నింటిలోనూ ఇలాంటివి కనిపిస్తాయి. మరిప్పుడు ఈ సినిమాలో ఏం చేస్తారో చూడాలి. ఇక అట్లీ సంగతి చూస్తే ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నాక విజయ్‌ సినిమా పనిలో పడతారట. అప్పుడు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ‘జవాన్‌’ ఫలితంపై విజయ్‌ సినిమా ఆధారపడి ఉంటుందా అంటే లేనే చెప్పాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus